పరీక్షల్లో ఫెయిలైతే ఓడినట్లు కాదు.. గుండె తరుక్కుపోతోంది : హరీశ్ రావు
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఆరుగురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో తన బాధను వ్యక్తం చేశారు.
పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే కారణంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధకరమన్నారు హరీశ్ రావు. పిల్లల ఆత్మహత్యల వార్తలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లు కాదని.. ప్రాణాలు పోతే తిరిగిరావన్నారు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని కోరారు.

మరో ట్వీట్ చేస్తూ.. పసిపిల్లలను వత్తిడికి గురిచేయొద్దని సూచించారు. అలాంటి చర్యలు మంచిది కాదని.. తల్లిదండ్రులకు టీచర్లను కోరారు. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందామన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications