హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీతో టచ్‌లో ఉన్నారు... బీజేపీ లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా ఉండే అంశంపై చర్చ జరగడంలో ఎలాంటీ తప్పులేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అయితే... ఇందుకు సంబంధించి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేప్పినట్టుగా, పార్టీ పరంగా ఎలాంటీ చర్చ జరగలేదని అన్నారు. అసలు కేంద్రపాలిత ప్రాంతం ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ రాజధానిపై చర్చ జరిగితే... అది అంతర్గతంగా కాకుండా ప్రజల్లో కొనసాగాలని అన్నారు.

టీఎస్ఆర్టీసీ సమ్మె, ఢిల్లీకి వెళ్లిన లక్ష్మణ్... జాతీయ నేతలకు ఫిర్యాదు...? టీఎస్ఆర్టీసీ సమ్మె, ఢిల్లీకి వెళ్లిన లక్ష్మణ్... జాతీయ నేతలకు ఫిర్యాదు...?

ఈనేపథ్యంలోనే తెలంగాణలో కొనసాగుతున్న పలు పథకాల అమలు తీరుపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజుల్లో పలు పథకాలు జోరుగా కొనసాగయాని, అవి ఇప్పుడు నత్తనడక నడుస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పాలన కూడ సజావుగా కొనసాగడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరుపై సమయం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతామని అన్నారు. ముఖ్యంగా ఇందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడ బీజేపీతో కలిసి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈనేపథ్యంలోనే ఆపార్టీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.

 TRS MLAs are in touch with the party ... BJP Laxman

అయితే రాజ్యంగబద్దంగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీ అడ్డదారిలో ముందుకు సాగడం లేదని అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కూడ ప్రభుత్వ తప్పులను కూడ ఎత్తి చూపుతారని ఆయన అన్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అయితే ఆర్టీసీ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పారు. అందుకే సమ్మెపై కేంద్రం ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదని అన్నారు.

English summary
Governament schemes are running very slow now a days compared with beginning of the trs government said BJP state president Laxman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X