అట్టహాసంగా తెలంగాణ సచివాలయం ప్రారంభం - తెలంగాణ శ్వేత సౌధం

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ఆవిష్కరణ ఘట్టం ప్రారంభమైంది. వాస్తు శాస్తం..తెలంగాణ సంప్రదాయాలు..ఆధునకీతక కలబోసి నిర్మించిన ఈ తెలంగాణ శ్వేత సౌధంలో నేటి నుంచి పాలన ప్రారంభం కానుంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు ఈ ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన, చండీ హోమాల్లో పాల్గొన్నారు. వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటున్నారు.

ప్రారంభోత్సవం ఆరంభం: యాగాలు పూర్తయిన తరువాత పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్ 1:20 నుంచి 1:32 గంటల మధ్య శిలాఫలకం ఆవిష్కరిస్తారు. ముందుగా ఖరారు చేసిన ముహూర్తంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయంలోని ఆరో అంతస్తులో తన కార్యాలయంలో ప్రవేశిస్తారు. తొలి సంతకం చేయటం ద్వారా అక్కడ నుంచి పాలన ప్రారంభిస్తారు. ఆ తరువాత 1:58 నుంచి 2:04 గంటల మధ్య మంత్రులు, అధికారులు తమతమ సీట్లలో ఆసీనులై సంతకాలు చేస్తారు. 2:15 గంటలకు అధికారులు, సిబ్బంది సభా ప్రాంగణానికి చేరుకొంటారు. తరువాత 2:15 నుంచి 2:45 గంటల మధ్య అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

Secretarait

పూజలు..యాగాలు : హుస్సేన్ సాగర తీరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ పర్యవేక్షణలో ఈ సచివాలయ నిర్మాణం పూర్తయింది. 2019 జూన్‌ 27న కేసీఆర్‌ భూమిపూజ చేయడంతో తొలి అడుగు పడింది. ఇంతలో కరోనా రూపంలో మరో అవాంతరం.. అన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటూ 2021 జనవరిలో పనులకు శ్రీకారం చుట్టారు. కొద్ది రోజుల క్రితం సాగర తీరాన 125 అడుగులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.. ఇప్పుడు సచివాలయం ప్రారంభోత్సవంతో హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి చేరింది. హైదరాబాద్ నగరానికే ఈ నిర్మాణాలు ఇప్పుడు లాండ్ మార్క్ గా మారాయి. ఇదే సమయంలో నూతన సచివాలయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

Secretarait

సీఎం కేసీఆర్ సందేశం : మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్నారు. నూతన సచివాలయం ప్రారంభం వేళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాసులు ఉన్నవారినే సచివాలయ ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. వెయ్యి మంది పోలీసులతో సచివాలయ భద్రతా చర్యలు చేపట్టారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్నహ్నాం తన సందేశం ఇవ్వనున్నారు. అన్ని హంగులతో ఆధునీకతతో నిర్మించిన ఈ సచివాలయంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో విధులు ప్రారంభం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+