ప్రాణం ఉన్నంతవరకూ పార్టీని వీడను: టీటీడీపీ కొత్త చీఫ్ బక్కిన నర్సింహులు, బాబు, లోకేష్‌లతో భేటీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పేరును ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భవన్ చేరుకుని అధ్యక్షుడిగా ఎన్నికైన బక్కని నర్సింహులుకు అభినందనలు తెలియజేశారు.
టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ ఇటీవల రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్ష స్థానంలో బక్కని నర్సింహులును చంద్రబాబు నియమించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు బక్కని నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు.

నర్సింహులు నాయకత్వంలో తెలంగాణ టీడీపీ మరింత బలోపేతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నర్సింహులకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తానని ఈ సందర్భంగా నర్సింహులు వ్యాఖ్యానించారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన దళిత నేత బక్కని నరసింహులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. pic.twitter.com/YsNDQ4jwfn
— Lokesh Nara (@naralokesh) July 19, 2021
కార్యకర్తగా పార్టీలోకి వచ్చి నాయకుడిగా మారి పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదంటూ.. ఎల్ రమణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు నర్సింహులు. టీడీపీలో మండల స్థాయి నుంచి రాష్ట్ర నేత వరకూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చా ఎమ్మెల్యేగా చేశాను, ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని అన్నారు.
తెలంగాణా తెలుగుదేశం పార్టీ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన దళిత నేత, మాజీ శాసనసభ్యులు, ఆత్మీయులు శ్రీ బక్కని నరసింహులు గారికి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సారధ్యంలో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/gr3eOyu6ui
— N Chandrababu Naidu (@ncbn) July 19, 2021
Recommended Video
టీటీడీపీని వీడనని వేంకటేశ్వరస్వామి మీద శపథం చేస్తున్నా.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేందుకు రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడతామని చెప్పారు. కాగా, ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే, ఆయనను కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానంలో ఎల్ రమణను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.












Click it and Unblock the Notifications