హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి...

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే... బుధవారం(మార్చి 10) రాత్రి ఇద్దరు యువకులు నగరంలోని ఓ ప్రాంతంలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అది ముగించుకుని అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై అతివేగంతో రయ్యిమని దూసుకెళ్లారు.చాదర్‌ఘాట్‌కు చేరుకున్న సమయంలో వేగం అదుపు కాకపోవడంతో బస్సును ఢీకొట్టారు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

 two youth riding a bike die due to a bus collission in hyderabd

ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతులను పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల ఫిబ్రవరిలో హస్తినపురం పరిధిలోనూ ఇదే తరహాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌతమ్ అనే యువకుడు మద్యం సేవించి అతివేగంతో కారు డ్రైవ్ చేశాడు. అదుపు తప్పిన కారు డివైడర్‌పై నుంచి మరో పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చొన్న సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతమ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే సందీప్ చనిపోయిన విషయం గ్రహించి గౌతమ్ అక్కడినుంచి పరారయ్యాడు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+