ప్రభుత్వ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగాల కలకలం .. వైద్య శాఖ ఏం చేస్తుందో ?
అనుమతి లేని కొలువులు చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లోని ఉద్యోగులు అడ్డంగా బుక్ అయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మంది నకిలీ ఉద్యోగులను గుర్తించారు సూపరిండెంట్ . కనీసం ఇంజక్షన్ కూడా సరిగా చేయడం రాకపోవడంతో అనుమానించిన సూపరిండెంట్ దీనిపై ఎంక్వయిరీ చేయగా అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేర ఘరానా మోసం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం జరిగింది. ఆసుపత్రిలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వారిని సూపరింటెండెంట్ గుర్తించడంతో ఈ తతంగం వెలుగు చూసింది. సూపరింటెండెంట్ డాక్టర్ రాములు ఆసుపత్రిలో వార్డులను పరిశీలించే సమయంలో ఒక వ్యక్తి రోగికి ఇంజక్షన్ కూడా ఇవ్వడం రాకుండా పని చేస్తున్న తీరుతో అనుమానం వచ్చిన సూపరింటెండెంట్ అతడిని ప్రశ్నించారు.

అనధికార నియామకాలు చేసిన సతీష్ అనే వ్యక్తి .. 24 మంది నియామకం
దీంతో సదరు వ్యక్తి, తనను సతీష్ అనే వ్యక్తి నియమించాడని, తనతో పాటు మరికొందరిని కూడా నియమించాడని చెప్పాడు. దీంతో సూపరింటెండెంట్ వార్డులను పరిశీలించి, ఆసుపత్రిలో పనిచేస్తున్న పది మందిని పట్టుకున్నారు. వారిని విచారించగా, సతీష్ అనే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎం ఉద్యోగాలు ఇప్పిస్తానని మొత్తం 24 మందిని అనధికారికంగా ఆసుపత్రిలో నియమించాడని తెలిసింది. ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకున్నట్టు బాధితులు తెలిపారు.

నకిలీలు పని చేస్తున్నా వైద్య శాఖ ఏం చేస్తుంది ?
ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది అనధికారికంగా అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేస్తున్న పట్టించుకోని వైద్యశాఖ తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఒక ప్రభుత్వ ఆస్పత్రి లో అనధికార నియామకాలు చేపట్టిన సతీష్ ఎవరు. అతని వెనుక వైద్య శాఖలో ఎవరైనా ఉండి ఈ తతంగమంతా చేయిస్తున్నారా అన్న అనుమానాలు సైతం లేకపోలేదు. సూపరింటెండెంట్ పరిశీలనలో భాగంగా 24 మంది నకిలీ ఉద్యోగులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనధికారికంగా ఉద్యోగాలు చేయిస్తున్న సతీష్ అనే వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి తెలియకుండానే ఈ వ్యవహారమంతా నడిచే అవకాశం లేదు. కాబట్టి ఈ నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఇదే అదునుగా రాష్ట్రవ్యాప్తంగా నకిలీలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications