Sudigali Sudheer : ఇది కదా కావాల్సింది...బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రీఎంట్రీ..రష్మీతో రచ్చ రంబోలా..!
సాధారణంగా వెండితెర మీదనే మనం హిట్ పెయిర్స్‌ను చూస్తుంటాం. ఇండస్ట్రీలో ఒక కాంబినేషన్‌లో సినిమా హిట్ అయితే మళ్లీ వాళ్లను రిపీట్ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే హిట్ పెయిర్ అనేది కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. బుల్లితెర మీద కూడా హిట్ పెయిర్స్ ఉన్నారని నిరూపించారు సుధీర్ రష్మీ జోడి. జబర్దస్త్ షోతో అటు సుడిగాలి సుధీర్, ఇటు రష్మీ ఇద్దరూ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్‌తో సుడిగాలి సుధీర్ లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వెండితెర మీద చాలామంది హీరోలు ఉన్నారు.

కాని బుల్లితెర హీరో అంటే మాత్రం ఒక్క సుడిగాలి సుధీర్ పేరు మాత్రమే వినిపిస్తుంటుంది. అంతలా మనోడి క్రేజ్ పెరిగిపోయింది.ఇక రష్మీ విషయానికొస్తే.. మొదట కొన్ని సినిమాల్లో నటించినప్పటికి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో.. బుల్లితెర మీద రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది.జబర్థస్త్ షోతో పాటు పలు షోలకు కూడా యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. సుధీర్ రష్మీ మధ్య నడిచి లవ్ ట్రాక్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. జబర్దస్త్ , ఢీ షోలలో వీరి మధ్య వచ్చే ఎపిసోడ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. తమ మధ్య లవ్ ట్రాక్ సూపర్ హిట్ కావడంతో .. ఈ జంట దీనిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. టీవీ రేటింగ్స్‌ను సైతం ప్రభావితం చేసేంతలా సుధీర్, రష్మీల ఎపిసోడ్స్ ఉండేవి అంటే అతిశయోక్తి కాదు.

అయితే సడన్‌గా జబర్దస్త్ , ఢీ షోలో సుడిగాలి సుధీర్ మాయమయ్యాడు. వేరే టీవీ ఛానెల్‌లో ఛాన్స్‌లు రావడంతో పాటు, సినిమాల్లో హీరోగా కూడా నటించడంతో ఈ మధ్య బుల్లితెర మీద సుధీర్ కనిపించడమే లేదు. సుధీర్ లేకపోవడంతో.. అటు రష్మీ హవా కూడా కాస్తా తగ్గిందనే చెప్పాలి. దీంతో ఈ జంట గురించి ప్రేక్షకుల కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. కాని తాజాగా ఈ జోడి మళ్లీ బుల్లితెర మీద కలిసి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారి అభిమానులు షాక్ గురైయ్యారు. ఈటీవీ 28వ వార్షికోత్సవం సంబరాల్లో సుధీర్ రష్మీ రచ్చ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు.

ఈ ప్రొమోలో ''మేడంగారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారని సుధీర్ అడగ్గా..దీనికి రష్మీ సమాధానం ఇస్తూ.. నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశానని .. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావని సుధీర్‌ను ప్రశ్నించింది. నేను ఎక్కడ ఉన్నా నా గుండెల్లో నువ్వే ఉంటావ్ కదా ''అంటూ సుధీర్ బదులివ్వడం ప్రొమోకే హైలేట్‌గా నిలిచింది. ఎంత గ్యాప్ వచ్చినా కూడా తమ మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం చెక్కు చెదరలేదని ఈ జోడి మరోసారి నిరుపించింది. చాలకాలం తరువాత సుధీర్, రష్మీ కలిసి కనిపించడంతో వారి అభిమానుల ఆనందానికి అడ్డులేకుండాపోయింది. యూట్యూబ్ జోడి బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications