సీఎం కేసీఆర్‌తో విజయ్ దర్దా భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ
జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. సమయం తీసుకొని మరీ నేషనల్ పాలిటిక్స్‌పై దృష్టిసారించారు. అయితే ఇవాళ సీఎం కేసీఆర్‌తో రాజ్యసభ మాజీ సభ్యుడు, లోక్ మత్ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్దా భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్ వచ్చిన దర్దా.. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
జాతీయ రాజకీయాలు, కేంద్రంలో సాగుతున్న బీజేపీ పాలన, బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఆవశ్యకత తదితర అంశాలపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించాలని అభిలషించారు. శాంతియుత పార్లమెంటరీ పంథాలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ పోరాటం గొప్పదని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను తక్కువ సమయంలో దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. పట్టుదల, ధైర్యం, రాజనీతిజ్ఞత, దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం తెలంగాణకే పరిమితం కావొద్దని అన్నారు. దేశ ప్రజల గుణాత్మక అభివృద్ధికి కేసీఆర్ దోహదపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తోన్న కేసీఆర్‌కు విజయ్ కామెంట్స్ బూస్టింగ్ ఇచ్చాయి. దీంతో కేసీఆర్ మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది. మరోసారి అన్ని పార్టీల నేతలను కలిసే యోచనలో ఉన్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications
