Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నదాతల ఆక్రందన.. సమస్యలు పట్టించుకోని సర్కార్: విజయశాంతి ఫైర్

సమయం దొరికితే చాలు.. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి విరుచుకుపడుతుంటారు. ఇవాళ మరోసారి ఫైరయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. అన్నం పెట్టే రైతులు ఉరికొయ్యలు వేలాడుతున్నా ప్రభుత్వాని పట్టడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగంపై కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ది చెబుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రచారమే

ప్రచారమే

రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా... రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయని విజయశాంతి విరుచుకుపడ్డారు. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో బ్యాంకులు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 115 శాతం పంట రుణాలు ఇచ్చాయని... ఆ ఏడాది రూ.10,233 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా... రూ. 11,787 కోట్లు ఇచ్చాయని వివరించారు. ఇక 2012-13లో ఏకంగా 121 శాతం, 2013-14లో 103 శాతం ఇవ్వగా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-15లో పంట రుణాల లక్ష్యంలో 93 శాతమే ఇచ్చాయని తెలిపారు.

రైతుబంధు పేరుతో..

రైతుబంధు పేరుతో..

రుణాల మంజూరు తగ్గిస్తూ వస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం రైతు బంధు ఇస్తున్నామనే సాకుతో రైతులకు పెట్టుబడి కోసం బ్యాంకు రుణాల మంజూరుకు ఎలాంటి సూచనలు చేయలేదని విజయశాంతి తెలిపారు. వానాకాలం సీజన్‌లో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోవడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. బ్యాంకుల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం, వ్యవసాయశాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం చూస్తుంటే రైతుల పట్ల తమకున్న వైఖరి అర్దమవుతుందన్నారు. వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వివరించారు.

61.94 లక్షల ఎకరాల్లో సాగు..

61.94 లక్షల ఎకరాల్లో సాగు..

వరి 61.94 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. సాధారణం కంటే వరి ఏకంగా 182 శాతం సాగు అయ్యింది. వరి రైతులే ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. వరి సాగు అయితనంత స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదన్నారు. పత్తి 46.42 లక్షల ఎకరాల్లో, కంది 7.64 లక్షల ఎకరాల్లో సాగు అయ్యిందన్నారు. కానీ పంట పెట్టుబడికి బ్యాంకులు ఇప్పటివరకు 43.45% మేరకే రుణాలు ఇచ్చాయంటే బ్యాంకుల తీరుకు ప్రభుత్వ వైఖరే కారణమని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. 2018 ఎన్నికల సమయంలో లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకపోవడంతో ఉన్న అప్పు తీరక, కొత్త అప్పు ఇవ్వడానికి బ్యాంకులు ముందడుగు వేయడం లేదన్నారు.

Recommended Video

    సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జానానికి సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్| Oneindia Telugu
    అప్పులపాలు

    అప్పులపాలు

    ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇవాళ తెలంగాణ రైతాంగం నిస్సహాయ పరిస్థితుల్లో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేశారు. అంచనా ప్రకారం రూ.5 వేల కోట్ల ప్రైవేట్‌ అప్పులు చేసినట్లు అంచనా ఉండగా... మరి ముఖ్యంగా రైతుబంధుకు కాని, బ్యాంకు రుణాలకు కాని నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు. వీరికి ప్రైవేట్‌ రుణాలు తప్ప మరో ఆధారం లేదన్నారు. పెట్టుబడి వ్యయం తలకు మించిన భారంగా మారి చేసిన అప్పులు తీర్చలేక ఉరికొయ్యల‌కు వేళాడుతున్నా వీరి చావులు ప్రభుత్వానికి కనబడుటలేదన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టింపులేనట్టు వ్యవహరిస్తోన్న టీఆర్ఎస్ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ది చెబుతుందని రాసుకొచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+