రూ.12 కోట్లు లూటీ కేసు: కీలక అనుమానితురాలు ఫోన్ స్విచాఫ్, ఫుణె టు హైదరాబాద్..

ఆంధ్రప్రదేశ్‌ మహేశ్ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ కేసులో ఎంక్వైరీ స్పీడప్ అయ్యింది. పది పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. కీలక అనుమానితురాలు షానాజ్‌ బేగం ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉంది. బెనిఫిషియరీ ఖాతాలుగా యాడ్‌ అయిన కరెంట్‌ అకౌంట్లకు సంబంధించి హిందుస్తాన్‌ ట్రేడర్స్‌ నిర్వాహకుడు వినోద్‌కుమార్, ఫార్మాహౌస్‌కు చెందిన సంపత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

ఫోన్ స్విచాఫ్..

ఫోన్ స్విచాఫ్..

ఫోన్ల పరిశీలించగా ప్రాథమిక ఆధారాలు లభించినప్పటికీ.. నేరంలో పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. కీలక అనుమానితురాలు షానాజ్‌ బేగం బషీర్‌బాగ్‌ బ్రాంచ్‌లో ఈ నెల 11వ తేదీన సేవింగ్‌ ఖాతా తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసింది సైబర్‌ నేరగాళ్ల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బ్యాంకుకు మాల్‌వేర్‌ పంపడం ద్వారా సర్వర్‌ను యాక్సెస్‌ చేశారా? లేక సర్వర్‌లోకి ప్రవేశించిడం ద్వారా లావాదేవీలు జరిపారా? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.

సర్వర్ కార్యాలయం..

సర్వర్ కార్యాలయం..

బంజారాహిల్స్‌లోని సంస్థ సర్వర్‌ కార్యాలయానికి పోలీసులు వెళ్లారు. బ్యాంక్‌ అధికారులు, సర్వర్‌ ఐటి నిర్వాహకులను పోలీసులు ఆరా తీశారు. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక ఐటి ఎక్స్ పర్ట్స్ టీమ్ పోలీసులకు సహకారం అందించింది. బెనిఫిషియరీ ఖాతాగా జోడించిన నాలుగో ఖాతా నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హ్యాకింగ్‌ చేయడానికి సైబర్‌ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌ వాడగా, వీటిలో కొన్ని గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్‌నెట్‌ సెంటర్‌‌కు సంబంధించినవి ఉన్నట్లు గుర్తించారు.

ఫ్రీగా వైఫై

ఫ్రీగా వైఫై

సదరు నిర్వాహకుడిని పోలీసులు విచారించారు. ఫ్రీ వైఫై సేవలు అందిస్తుంటానని, అది 24 గంటలూ ఆన్‌లోనే ఉంటుందని నెట్ నిర్వాహకుడు చెప్పారు. దీంతో నిర్ణీత సమయంలో ఆ వైఫైని ఎవరెవరు వాడుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షానాజ్‌కు సైబర్ క్రైమ్ ఫోన్ చేసినప్పటి నుంచి ఆమె తన సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. షానాజ్‌ పుణేలో ఎక్కువ కాలం ఉన్నట్లు గుర్తించారు. ఆమె అక్కడి నుంచి హైదరాబాద్‌కు పలుమార్లు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. మహేష్ బ్యాంక్ సర్వర్ నుంచి 12.93 కోట్లు బదిలీ అయిన 129 ఖాతాలకు సంబంధించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వారి కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తున్నారు.

Recommended Video

    Telangana Teachers Reacts On GO 317 | Oneindia Telugu
     సైబర్ అటాక్

    సైబర్ అటాక్

    మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి మరీ నగదును దోచుకున్నారు. బ్యాంకు అకౌంట్లలో గల రూ.12కోట్లకు పైగా నగదును కాజేశారు. హ్యాక్ చేసిన సర్వర్ నుంచి 120 అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. బ్యాంకు మెయిన్ సర్వర్ పై సైబర్ అటాక్ జరిగినట్లు గుర్తించిన బ్యాంకు యాజమాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మరింత ముమ్మరం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+