సమ్మెకు వీఆర్ఏలు తాత్కాలిక బ్రేక్, మంత్రి కేటీఆర్ హామీతో.. 20వ తేదీ వరకు మాత్రం
వీఆర్ఏలకు తమ నిరసనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ హామీతో సమ్మెను తాత్కాలికంగా సమ్మెను విరమించారు. వీఆర్ఏలు పే స్కేల్ అమలు, అర్హులకు ప్రమోషన్లు, 55 ఏళ్లు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు తదితర డిమాండ్లతో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ వీఆర్ఏ ముఖ్య నాయకులతో మంగళవారం చర్చలు జరిపారు. సమావేశం అనంతరం వీఆర్ఏ ముఖ్య ప్రతినిధులు మీడియాతో మాట్డారు. హక్కుల కోసం 50 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నామని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ తమతో చర్చలు జరిపారని.. గతంలో కేసీఆర్ ఇచ్చిన హమీల గురించి ఆయనకు వివరించామని పేర్కొన్నారు. ఈ నెల 20వతేది జాయింట్ మీటింగ్ ఉందని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులపై తమకు నమ్మకం ఉందన్నారు.

గ్రామాల్లో వీఆర్ఏలపై చాలా భారం పడుతుందని గుర్తుచేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దు అయ్యాక జాబ్ చార్ట్‌లో లేని విధులను కూడా తమతో చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా.. ఉన్నతాధికారుల నిర్లక్షం వల్లే ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఆ హామీలపై జీవో వచ్చాకే సమ్మె విరమించాలని అనుకున్నామని వివరించారు. మంత్రి కేటీఆర్ హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు నిరసన శిబిరాల్లో తాము శాంతియుతంగా కార్యక్రమాలు కొనసాగిస్తాం అని వివరించారు.












Click it and Unblock the Notifications