బీజేపీలోకి మాజీ క్రికెటర్ లక్ష్మణ్..? అమిత్ షా సమక్షంలో చేరిక
హుజురాబాద్ బై పోల్ వేళ.. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరి.. ముగిసింది. ఇవాళ సాయంత్రం ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా పార్టీలో చేరికలు హాట్ టాపిక్ అవుతుంది. టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యాడా.. అందుకే బీజేపీ జాతీయ నేతలతో చర్చల్లో ఉంటున్నారా.. అని సందేహాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం పావులు కదుపుతున్న బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందనుకోవడంలో సందేహాం లేదనిపిస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎన్నికల ముందు సెలబ్రిటీలను పార్టీలోకి చేర్చుకుని అటెన్షన్ గ్రాబ్ చేసుకోవడం పొలిటికల్ పార్టీల టెక్నిక్ అనే సంగతి తెలిసిందే.

GHMC పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రకటన అధికారికంగా రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకుని.. విషయాన్ని వెల్లడిస్తారు. అక్టోబర్ 12, 2012లో లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్నారు. ఓ స్పోర్ట్స్ ఛానల్ కు కామెంటేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications