గిరిజన బంధు కావాలె.. ఈటల రాజేంధర్ డిమాండ్
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చాడని విమర్శించారు. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామనే కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు అని విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నాడు. ధరణి పోర్టల్ వలన సొంత భూముల మీద హక్కులు కోల్పోతున్నాం. సమాజంలో అత్యంత వెనుకబడిన వారు హరిజనులు, గిరిజనులు. కేసీఆర్ మాటలు గొప్పగా ఉంటాయని వివరించారు. అచరణకు మాత్రం నోచుకోవని విమర్శించారు.

రిజర్వేషన్లు ఏవీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఏమైంది అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో కేసీఆర్ చెప్పాలి అని పేర్కొన్నారు. అన్నీ అబద్దపు మాటలు అని విమర్శించారు.

ఇవే అంశాలే
దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది. దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తొవది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు.
Recommended Video

2 వేల కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందన్నారు. అందుకోసం అధనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఖర్చు చేయనున్నట్టు సీఎం తెలిపారు. దళిత బంధు పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications