హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. అత్యవసరం అయితేనే బయటకు రావాలి..
మరో 3 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక భాగ్యనగరం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవును గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో ముసురు ఉంది. దీంతో జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఉదయం నుంచే తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. కాసేపటికి వర్షం గట్టిగా కూడా పడింది.
హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. మరో మూడు రోజులు హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. అవసరమైతేనే ప్రజలు ఇళ్లు నుంచి బయటకు రావాలని కోరింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని జలాశయాలకు జలకళ వచ్చింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైతులు కూడా పొలాల బాట పట్టి, వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు.
రాష్ట్రమంతా చల్లని వాతావరణం నెలకొంది. ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో చిన్న పిల్లలు, ముసలి వారు అల్లాడి పోతున్నారు. వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో శుభ్రంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. బయటకు వెళ్లి వస్తే.. శుభ్రంగా చేతులు కాళ్లు, కడుక్కోవాలని సూచించారు. కాచిన నీటిని వడబోసి తాగాలని కోరారు.












Click it and Unblock the Notifications