ఈ స్కూల్స్ స్టార్ట్.. హైకోర్టు కూడా ఓకే.. బడి బాట
స్కూల్స్ ఓపెన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలు అనుసరించి బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చు అని సూచించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కోర్టు అందుకు అనుమతులను కూడా ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తరగతులకు పర్మిషన్ ఇచ్చింది.
ప్రభుత్వ రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, హాస్టల్స్ మినహా అన్ని విద్యా సంస్థలు బుధవారం నుంచి తెరిచేందుకు అంగీకారం తెలిపింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థులను స్కూల్స్ యాజమాన్యాలు బలవంతపెట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలను స్కూల్స్‌కు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోతే స్కూల్ మేనేజ్ మెంట్స్ బలవంతం చేయకూడదని తెలిపింది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లేదా ఏదైనా నిర్వహించుకునే అధికారం పాఠశాలలకు ఉందన్నారు.

ఆన్‌లైన్, ఆఫ్ లైన్ బోధనపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది. పాఠశాలలు అనుసరించాల్సిన విధివిధాలను రూపొందించాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చింది. పిల్లలకు స్కూల్స్‌లో ఏమైనా జరిగినా, వైరస్ సోకినా స్కూల్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని పేరెంట్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తీసుకుంటున్న అనుమతి పత్రం చట్టపరంగా చెల్లదని స్పష్టం చేసింది. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎస్‌ఓపీలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభానికి మార్గం సుగమం అయింది. ప్రత్యక్ష బోధనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో గత ప్రకటనకు సవరణ చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీలతో సహా కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనకు ఆదేశాలిచ్చింది. అయితే సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల వంటి గురుకుల పాఠశాలలను ఇందుకు మినహాయించారు. ఇక, పూర్తిస్థాయిలో ప్రత్యక్ష బోధన చేపట్టాలా? ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలా? అనేది ప్రైవేటు విద్యాసంస్థలు నిర్ణయం తీసుకోవచ్చని సర్కారు పేర్కొంది. ఇవాళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గురుకుల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications