హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సీపీ ఆ వార్నింగ్‌ ఇవ్వడంలో ఆంతర్యమేంటి?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భాగ్యనగరంలో ఏం జరుగుతోంది? నగర పోలీస్ కమిషనర్ అంతలా వార్నింగ్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి? జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యం.. వినాయక చవితి పండుగ.. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? తాజా పరిణామాలు చూస్తే పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు దేశమంతటా హై అలర్ట్ ప్రకటించడంతో నగర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. భారత్‌లోకి టెర్రరిస్టులు చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆ క్రమంలో హైదరాబాద్ సీపీ వార్నింగ్ చర్చానీయాంశమైంది.

 వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు సీపీ వార్నింగ్

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు సీపీ వార్నింగ్

ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని నిఘా వర్గాలు నిర్ధారించాయి. అయితే ఫేక్ వార్తలను నమ్మొద్దని కోరారు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. పాత వీడియోలు, ఫేక్ న్యూస్ కొందరు కావాలని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపారు. పది పదిహేనురోజులుగా ఇతర దేశాల్లో ఇదివరకు జరిగిన కొన్ని ఘటనలను ఫార్వార్డ్ చేస్తున్నారని.. అది మంచి పద్దతి కాదని చెప్పుకొచ్చారు. ఒకవేళ అలాంటివి సర్క్యులేట్ చేస్తే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను షేర్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అడ్మిన్లదేనంటూ వార్నింగ్ ఇచ్చారు అంజనీ కుమార్. అప్పుడెప్పుడో ఇతర దేశాల్లో జరిగిన హింసాకాండకు చెందిన వీడియోలను కొందరు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారని.. ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చందాలు బందే.. బలవంతంగా వసూలు చేస్తే అంతే.. పోలీసుల హెచ్చరిక..!

ఫేక్ వీడియోలు షేర్ చేస్తే అడ్మిన్లదే బాధ్యత..!

ఫేక్ వీడియోలు షేర్ చేస్తే అడ్మిన్లదే బాధ్యత..!

నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగేలా చేస్తే తగిన విధంగా శిక్షిస్తామన్నారు సీపీ. వాట్సాప్ వీడియోలు, సందేశాలు సర్క్యులేట్ విషయంలో నిఘా పెట్టామని.. ఒకవేళ ఎవరైనా పాత వీడియోలు షేర్ చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా పనికిరాని వీడియోలు, హింసాకాండకు సంబంధించిన వీడియోలు వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేస్తే గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా హై అలర్ట్.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం..!

దేశ వ్యాప్తంగా హై అలర్ట్.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం..!

దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారత్‌లోకి టెర్రరిస్టులు చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో కేంద్రం అప్రమత్తమైంది. అఫ్ఘానిస్థాన్ దేశ పౌరులుగా పాసుపోర్టులు పొంది పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చారనే క్రమంలో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం.

ఈ నెల మొదటివారంలో ఆ నలుగురు టెర్రరిస్టులు ఇండియాలోకి ప్రవేశించారని ఇంటిలిజెన్స్ బ్యూరో కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఆ ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా విధ్వంసక చర్యలకు పాల్పడే ఛాన్సుందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలపై ఉగ్రవాదులు కన్నేసినట్లు తమకు కీలక సమాచారం లభించిందని ఐబీ అధికారులు వెల్లడించారు. అదే క్రమంలో హైదరాబాద్‌ను పోలీసులు జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అలర్టయ్యారు. పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం.

English summary
Hyderabad Police Commissioner, Anjani Kumar said that the strict actions will be taken against administrators of WhatsApp groups found circulating violence videos on the messaging app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X