హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సారూ.. ఆ లక్ష ఖాళీల సంగతేందీ.. వైఎస్ షర్మిల విసుర్లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మిగతా లక్ష ఉద్యోగాల గురించి ఆమె ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం వలిగొండ మండలం బూర్లగడ్డ గ్రామంలో పర్యటించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నందున ఇవాళ కూడా దీక్ష చేశారు. సాయంత్రం 5.30గంటలకు దీక్ష విరమించారు. తర్వాత బూర్లగడ్డ నుంచి నెమిలికాలువ జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు.

ఆత్మహత్యలే శరణ్యమా..?

ఆత్మహత్యలే శరణ్యమా..?

వైయ‌స్ పాల‌న‌లో నిరుద్యోగులు, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని గుర్తుచేశారు. ఏ ఒక్కరూ ఆత్మహ‌త్య చేసుకోలేదు. ఐదేండ్లలోనే మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చి, ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు. 2008లో జంబో డీఎస్సీతో 54 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన మ‌హ‌నీయుడు వైయ‌స్ఆర్.. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలో 11 ల‌క్షల ఉద్యోగాలు సృష్టించారు. కేసీఆర్ కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారు? ఉద్యోగాలు రాక మన బిడ్డ‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారని షర్మిల విమర్శించారు. కేసీఆర్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఏడేండ్లలో నిరుద్యోగం నాలుగింత‌లు పెరిగిందన్నారు. ఇప్ప‌టివరకు 54 ల‌క్ష‌ల మంది తమకు ఉద్యోగం కావాల‌ని ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

పోరాడితేనే ప్రకటన

పోరాడితేనే ప్రకటన


ప‌రిపాలించే నాయ‌కుడికి ముందుచూపు ఉండాలి. ఎంత‌మంది చ‌దువుకున్నారు? ఎంత‌మంది చదువుకుంటున్నారు, ఎన్ని ఉద్యోగాలు క‌ల్పించాలి అనే ఆలోచ‌న చేయాలి. మేం పోరాటాలు చేస్తే మొన్న‌టికి మొన్న ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వలేదు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ..ఒక్క హామీ కూడా నిల‌బెట్టుకోలేదు. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇస్తాన‌ని ఇవ్వ‌లేదు. పేద‌ల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వ‌లేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ నెర‌వేర్చ‌లేదు. మ‌హిళ‌ల‌కు సున్నా వ‌డ్డీకే రుణాలు అని మోసం చేశారు.

వారు మాత్రం చదవ అవసరం లేదు..

వారు మాత్రం చదవ అవసరం లేదు..


ఐదారు చ‌దివిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావ‌చ్చు. కానీ డిగ్రీలు, పీజీలు చేసి ఆటోలు న‌డుపుకుంటూ, హ‌మాలీ ప‌ని చేసుకుంటూ, గొర్లుబ‌ర్లు కాసుకుంటూ బ‌త‌కాలా?
కేవ‌లం 80,000 ఉద్యోగాల‌కు మాత్రమే నోటిఫికేష‌న్లు అంటున్నారు. పీఆర్సీ ప్ర‌కారం చూసినా, బిస్వాల్ క‌మిటీ ప్ర‌కారం అయినా మొత్తం ల‌క్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మ‌రి కేసీఆర్ 80,000 ఉద్యోగాలే అనడం ఏంటి? మిగ‌తా ల‌క్ష ఉద్యోగాలు కేసీఆర్ గారు మింగేశారా? లేక కేసీఆర్ గారి పార్టీ వాళ్ల‌కు ఇచ్చుకుంటారా? ఏం చేస్తారో కేసీఆర్ గారు స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 80,000 కాదు మొత్తం ల‌క్షా 91 వేలు ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌ని కేసీఆర్ గారిని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ కొలువులు కూడా..

ప్రైవేట్ కొలువులు కూడా..

ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల‌కు స్కిల్ డెవెల‌ప్‌మెంట్ ప్రొగ్రామ్స్ ఏర్పాటు చేసి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు క‌ల్పించాలి. అర్హుల‌ను గుర్తించి, వారికి కార్పొరేష‌న్ల ద్వారా లోన్లు ఇప్పించాలి. కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగుల‌ను మోసం చేశారు. ఉద్యోగం లేక‌పోతే నిరుద్యోగ భృతి ప్ర‌తి నెలా రూ. 3016 ఇస్తాన‌ని మోసం చేశారు. ఇప్ప‌టికే కేసీఆర్ ప్ర‌తి నిరుద్యోగికి ల‌క్షా 20 వేల రూపాయ‌ల బాకీ ఉన్నారు. ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌లేక‌పోతే ప్ర‌తి నిరుద్యోగికీ నిరుద్యోగ భృతి చెల్లించాల‌ని కోరారు.

English summary
where is another one lakh jobs ysrtp chief ys sharmila asked to cm kcr. government cheated to unemployed youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X