Sharmila:ఉద్యమకారులకు నో జాబ్.. అమెరికా నుంచి వచ్చిన వారికి మాత్రం..
1200 మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదు కానీ అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ బిడ్డలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని వైఎస్ షర్మిళ అన్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం ఆగర్మియగూడ గ్రామ శివారులో పాదయాత్ర మొదలుపెట్టారు. 4 కిలోమీటర్లు నడిచి తిమ్మాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నందున ఇవాళ కూడా దీక్ష చేశారు. 14వ వారం తిమ్మాపూర్ గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. మహిళలు పలు సమస్యలను షర్మిలకు నివేదించారు. దీక్ష విరమించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

స్పందించని కేసీఆర్
తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఉద్యోగాలు ఇవ్వాలని ఎంత మొరపెట్టుకున్నా కేసీఆర్ స్పందించడం లేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలనే సోయి కూడా సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. ఉద్యమంలో చందమామ లాంటి చక్కటి పిల్లలు ఉద్యోగాలు లేక చనిపోతున్నారని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అదే నిరుద్యోగులు కళ్ల ముందే ఆత్మహత్య చేసుకుంటున్నా కనికరం చూపించడం లేదన్నారు. దున్నపోతు మీద వానపడ్డట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు.. లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత నిజామాబాద్‌లో ఓడిపోతే.. వెంటనే ఎమ్మెల్సీని చేసి పదవి కట్టబెట్టాడని చెప్పారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు ఆత్మహత్యలే మిగిలుతున్నాయని తెలిపారు.

వైఎస్ హయాంలో..
వైఎస్ఆర్ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని షర్మిల అన్నారు. ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. ఐదేళ్లలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పారు. 2008లో జంబో డీఎస్సీతో 54 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన మహనీయుడు వైయస్ఆర్ అని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించారు. పేదవాడికి జబ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే పేద వాడి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చేలా చేసిన గొప్ప నాయకుడు మన వైఎస్ఆర్ అని చెప్పారు. ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 45 లక్షల ఇండ్లు నిర్మిస్తే.. వైఎస్ఆర్ 46 లక్షల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారని చెప్పారు. ఒక్క చార్జీ కూడా పెంచకుండా సంక్షేమ పాలన అందించిన రికార్డు సీఎం వైఎస్ఆర్ అని చెప్పారు. 64 లక్షల రైతులకు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తొలుత ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని వివరించారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఎన్నో విద్యాసంస్థలు, వర్సిటీలు నెలకొల్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారు. వైఎస్ఆర్ హయాంలో ఎంతో మంది పేదలు.. డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. వైయస్ఆర్ గారు ఏం చేసినా అద్భుతంగానే ఉండేది.

మోసం.. మోసం...
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. రైతులకు రుణమాఫీ అని, కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని దగా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. 4 లక్షల అప్పులు చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి, లిక్కర్ ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఏడేళ్లలో 3000 బడులను మూసివేశారు. 14000 టీచర్లను తొలగించారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోగా.. ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం లేదు. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారు కూరగాయలు, టిఫిన్ సెంటర్లు, టీ బండి, హమాలీ పనికి పోతున్నారు. మాట తప్పితే రాళ్లతో కొట్టి చంపండి అని కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన మాట.. అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన కేసీఆర్‌ను ఏం చేయాలో ప్రజలే తేల్చాలి. మళ్లీ మళ్లీ కేసీఆర్ చేతిలో ప్రజలు మోసపోవద్దు. ఇప్పటికే కేసీఆర్ చేతిలో రెండు సార్లు మోసపోయారు.

4 రెట్లు
నిరుద్యోగుల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి అని చెప్పారు. ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగిందన్నారు. ప్రభుత్వం దగ్గర 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకోని వాళ్లు ఎంత మందో లెక్కలేదు. నిరుద్యోగం తెలంగాణను పట్టి పీడిస్తున్నా కేసీఆర్ లో చలనం లేదు. ఇదీ కేసీఆర్ ని ఎన్నుకున్నందుకు మనకు ఇచ్చిన బహుమతి. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాజంలో తలెత్తుకుని తిరగలేక, తల్లిదండ్రులకు భారం కాలేక... చనిపోతుంటే కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగుల ఆవేదన కేసీఆర్ కు పట్టదు. ఫామ్‌హౌజ్‌లో నిద్రపోడానికి కేసీఆర్‌ను సీఎంను చేసింది? మన పిల్లల్ని చంపడానికా కేసీఆర్‌ను సీఎం చేసుకుందని చెప్పారు.

మేం ఉన్నాం..
విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. మీ పక్షాన నిలబడతాం.. పోరాటం చేస్తాం. మీకు న్యాయం జరిగే వరకు, మీకు ఉద్యోగాలు వచ్చే వరకు మీ పక్షాన ఉంటాం అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మీ మేలు కోసం పనిచేస్తాం అని వివరించారు. కేసీఆర్‌ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇకనైనా ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరారు. కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3 లక్షల 85 వేల ఖాళీలను సైతం భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 54 లక్షల మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలన్నారు. 10 లక్షల మంది అర్హులకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలని.. ఇవన్నీచేతకాక పోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని సూచించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications