కనిపించే మూడు సింహాలు వీసీ సజ్జనార్.. కనిపించని ఆ నాలుగో సింహం ఎవరు..? ఎన్‌కౌంటర్ వెనక..

Recommended Video

    Disha Issue : రేపిస్టుల ఎన్‌కౌంటర్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం ! || Oneindia Telugu

    శుక్రవారం ఉదయం... ఒక్కసారిగా దేశం మొత్తం ఒకే విషయంపై చర్చించుకుంది. డాక్టర్ దిశా అత్యాచారం ఆపై హత్యతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌లు వచ్చాయి. ఈ అంశం పార్లమెంటును కూడా కుదిపేసింది. చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిందే నంటూ ప్రజాప్రతినిధులు తమ గళాన్ని పార్లమెంటులో వినిపించారు. ఇక శుక్రవారం ఉదయం నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశం మొత్తం సంబురాలు జరుపుకుంది. పోలీసులను ప్రశంసించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా మానిటర్ చేస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్‌కు తెలుగు రాష్ట్రాల మహిళాలోకం జేజేలు పలుకుతోంది.

    జయహో కేటీఆర్ అంటున్న మహిళాలోకం

    జయహో కేటీఆర్ అంటున్న మహిళాలోకం

    శుక్రవారం ఉదయం దేశం ఓ పెద్ద బ్రేకింగ్ న్యూస్‌తో నిద్ర లేచింది. ఏ టీకొట్టులో చూసిన నలుగురు మాట్లాడుకున్న మాట దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని. ఎక్కడ ప్రజలు గుమికూడినా నిందితుల ఎన్‌కౌంటర్ గురించే టాపిక్. ఇక తెలుగు రాష్ట్రాల మహిళాలోకం మాత్రం ఈ క్రెడిట్ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని చెబుతున్నారు. దిశా అత్యాచారం, ఆ పై హత్య జరగడం తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. మంత్రి కేటీఆర్ తానే స్వయంగా కేసును పరిశీలిస్తానంటూ ట్వీట్ కూడా చేశారు. అదే సమయంలో ప్రధాని మోడీకి కూడా ఘటనపై ట్వీట్ చేస్తూ చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిందేనని చెప్పారు. అంతేకాదు కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రధాని మోడీకి ట్వీట్ చేశారు కేటీఆర్.

    కేసును స్వయంగా మానిటర్ చేసిన కేటీఆర్

    చట్టాలను సవరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పిన కేటీఆర్... నిందితులను పట్టుకుని సపరమర్యాదలు చేయడం సరికాదని చెప్పారు. దిశ కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయం చేయకపోతే ఏం లాభం అని కూడా ప్రధాని మోడీని ప్రశ్నించారు. న్యాయం చేయడంలో జాప్యం జరిగితే అన్యాయం చేసినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే చట్టాలను సవరిస్తూ మరింత కఠినతరం చేయాలంటూ ప్రధాని మోడీని కోరారు మంత్రి కేటీఆర్.

     మంత్రులను కట్టడి చేసిన కేటీఆర్

    మంత్రులను కట్టడి చేసిన కేటీఆర్

    ఇక డాక్టర్ దిశా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రులు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడంపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదన్న వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి మహ్మూద్ అలీ. దీనిపై కేటీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. ఇష్టానుసారంగా మంత్రులు మాట్లాడరాదని హెచ్చరిస్తూనే మొత్తం వ్యవహారం పోలీసులు చూసుకుంటారని చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చింది ప్రభుత్వం. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ తాను బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి నిందితులను ఎన్‌కౌంటర్ చేయాల్సిందిగా చెప్పలేనని.. అదే సమయంలో ప్రజల డిమాండ్‌ను తాను తప్పు పట్టలేనని చెప్పారు. తెల్లారి చూస్తే నిందితులను ఎన్‌కౌంటర్ చేశారనే వార్త గుప్పుమంది.

    ఆ బుల్లెట్ దాచుకోవాలనుంది:

    నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారని తెలుసుకున్న ప్రజలు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులకు జేజేలు పలికారు. ఇక మహిళలు కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక ఎన్‌కౌంటర్‌పై హీరో మంచు మనోజ్ స్పందించారు. నిందితుల శరీరంలోకి దిగిన బుల్లెట్ దాచుకోవాలని ఉందన్నారు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందంటూ ట్వీట్ చేశారు. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కుందా అంటూ చెప్పుకొచ్చారు.ఈ రోజే ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా అంటూ ట్వీట్ చేశారు మంచు మనోజ్.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+