Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శన టికెట్ల ఇకపై ఆన్‌లైన్లోనూ: టికెట్ల ధరలు ఇలా!

భక్తుల దైవదర్శనంతోపాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాలలో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్‌లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. యాదాద్రిలో ఆలయ నిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజా కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శన టికెట్లు పొందండిలా

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శన టికెట్లు పొందండిలా

భక్తుల దైవదర్శనంతోపాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాలలో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్‌లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షేత్రాభివృద్ధిలో ఆలయ పునర్ నిర్మాణం తర్వాత అంచెలంచెలుగా ఈ సేవలు విస్తరించాయి. ఈ సేవలతో దూర ప్రాంతాల భక్తులకు స్వామి వారి దర్శనం చాలా సులభంగా లభిస్తుంది. బ్రహ్మోత్సవాల టికెట్లను సైతం ఇబ్బందులు కలగకుండా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను పొందాలంటే సంబంధిత వెబ్‌సైట్ https://yadadritemple.telangana.gov.in/ సంప్రదించాలి.

తిరుమల తరహాలో యాదాద్రిలో బ్రేక్, శీఘ్ర దర్శన టికెట్లు

తిరుమల తరహాలో యాదాద్రిలో బ్రేక్, శీఘ్ర దర్శన టికెట్లు

తిరుమల తరహాలో యాదాద్రిలో బ్రేక్ దర్శనం టికెట్లను కూడా పొందుపర్చారు. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ. 300, రూ. 150 శీఘ్రదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఆలయంలో జరిపే వివిధ ఏర్పాట్లకు విరాళమిచ్చేందుకు ఈ డొనేషన్ సదుపాయం కల్పించారు. దీనిని ఈ-హుండీ అంటారు. ప్రధాన ఆలయం దివ్యవిమాన గోపురాన్ని స్వర్ణమయం చేసేందుకు ఆన్‌లైన్‌లో వితరణ చేయొచ్చు.

యాదాద్రి తిరుకళ్యాణ టికెట్లు ఇలా బుక్ చేసుకోండి

యాదాద్రి తిరుకళ్యాణ టికెట్లు ఇలా బుక్ చేసుకోండి

వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుకళ్యాణ మహోత్సవం-2023 టికెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ధర రూ. 3వేలు, ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28న తిరు కళ్యాణం జరగనుంది. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుకింగ్‌లో పేరు, పూజ వివరాలు, గోత్రం, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, తేదీ, వెల, ఎన్ని టికెట్లు, చిరునామా తెలియజేయాల్సి ఉంటుంది. నక్షత్రం, రాశి, ఆధార్ నెంబర్, వయస్సు, ఆలయ సందర్శన వేళల వివరాలు నింపాలి.

యాదాద్రిలో వాహన పూజ, గదుల టికెట్ల ధరలు ఇవే

యాదాద్రిలో వాహన పూజ, గదుల టికెట్ల ధరలు ఇవే

ఇక శాశ్వత నిత్యపూజ పదేళ్లకు రూ. 15వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన రూ. 15వేలుగా నిర్ణయించారు. రాత్రి బసచేసే భక్తుల కోసం కొండ కింద గదులు ఉన్నాయి. లక్ష్మీ నిలయం నాన్ ఏసీకి రూ. 560, లక్ష్మీ నిలయం నాన్ ఏసీ డీలక్స్ రూ. 1000గా నిర్ణయించారు. స్కూటర్ పూజ రూ. 300, ఆటో పూజ రూ. 400, కారు పూజ రూ. 500, బస్సు, లారీ, ట్రాక్టర్ పూజ రూ. 1000గా నిర్ణయించారు.

యాదాద్రిలో వివిధ పూజలు, వాటి టికెట్ల ధరలు

యాదాద్రిలో వివిధ పూజలు, వాటి టికెట్ల ధరలు

శయనోత్సవం రూ. 100, స్వర్ణపుష్పార్చన రూ. 600, సుప్రభాత దర్శనం రూ. 100, దర్బార్ సేవ రూ. 516, అష్టోత్తర ఘటాభిషేకం రూ. 1000, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం రూ. 800గా ఉంది. ఇందులో నిజాభిషేకం(ఇద్దరికి రూ. 800, ఒక్కొక్కరికి రూ. 400). సహస్రనామార్చన రూ. 300, శ్రీ సుదర్శన నారసింహహోమం రూ. 1250, స్వామివారి కళ్యాణం రూ. 1500గా నిర్ణయించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ సేవలను ఆన్‌లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+