హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ ఓవర్ డోస్: హైదరాబాద్‌లో యువకుడు మృతి.. ఫస్ట్ కేసు

|
Google Oneindia TeluguNews

పట్నం, పల్లె అనే తేడా లేకుండా డ్రగ్స్ దొరుకుతున్నాయి. దీంతో యువత పెడదారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో ఓ యువకుడు.. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నాడు. ఇంకేముంది తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయాడు. డ్రగ్స్ తీసుకుని చనిపోయిన ఘటనలో హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు చేశామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరించారు. హైదరాబాద్ నల్లకుంట శివమ్ రోడ్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు.

ప్రేమ్ ఫ్రెండ్

ప్రేమ్ ఫ్రెండ్


చనిపోయిన యువకుడు డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ్ స్నేహితుడిగా పోలీసులు పేర్కొన్నారు. గోవాలో పలు రకాల డ్రగ్స్ తీసుకోగా..అనారోగ్యానికి గురై వారం రోజుల్లోనే మృతి చెందాడని డీఎస్ చౌహన్ పేర్కొన్నారు. బీ టెక్ పూర్తి చేసిర ఆ యువకుడు డ్రగ్స్ కి బానిసై నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ పరిధిలో డ్రగ్స్ దందాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో మాధకద్రవ్యాలను సమూలంగా మట్టుపెట్టాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు.

 ఓవర్ డోస్ వల్లే

ఓవర్ డోస్ వల్లే


డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే విద్యార్థి చనిపోయాడని హెచ్ న్యూ చీఫ్ చక్రవర్తి అన్నారు. చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు విషయం తెలియదన్నారు. విద్యార్థి కుటుంబం షాక్‌లో ఉందన్నారు. విద్యార్థి డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు పేరెంట్స్ గుర్తించలేదని చెప్పారు. విద్యార్థుల్లో వస్తున్న మార్పులను పేరెంట్స్ గుర్తించాలని సూచించారు. చాలా మంది విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డ వారి లిస్టు తమ వద్ద ఉందన్నారు.

ఇద్దరూ కలిసి

ఇద్దరూ కలిసి


నల్లకుంట శివమ్ రోడ్‌లో ఉంటున్న ప్రేమ్ ఉదయ్ కుమార్ రియల్ ఎస్టేట్ చేస్తుండేవాడు. ఇటీవల శ్రీరామ్ అనే యువకుడితో కలిసి ప్రేమ్ ఉదయ్ డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ జోషూవ్ అనే కొందరు యువకులు ప్రేమ్, ఉదయ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కెమికల్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా శ్రీరామ్ డ్రగ్స్ తయారు చేయడం నేర్చుకున్నాడు. శ్రీరామ్ తెలివితేటలను ప్రేమ్ డ్రగ్స్ తయారు చేయడానికి ఉపగించాడు. వీరిద్దరూ కలిసి కెమికల్ ప్రాసెస్ ద్వారా డ్రగ్స్ తయారీకి అమెజాన్ లాంటి కొరియర్ సర్వీసులను ఉపయోగించుకున్నారని ఏసీపీ డీఎస్ చౌహన్ వివరించారు. డ్రగ్స్ తయారు చేయడంలో ఎక్స్ పర్ట్ అయిన శ్రీరామ్ ఒక ఇల్లీగల్ డ్రగ్ ప్రోడక్ట్ తయారు చేసి విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

English summary
young man died due to drug overdose. incident happened at hyderabad nallakunta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X