హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మ ఈవ్: వైఎస్ఆర్ టీపీ సాంగ్, ప్రభుత్వంపై విమర్శలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సంరంభం మిన్నంటింది. ఎక్కడ చూసినా బతుకమ్మల హోరే.. బతుకమ్మ పండగ సందర్భంగా సాంగ్స్ తీయడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల జాగృతి సాంగ్ కూడా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ పార్టీ సాంగ్ రిలీజ్ చేసింది. అదీ కూడా యువతను ఆకట్టుకుంటుందనడంలో సందేహాం లేదు. కానీ ఎక్కువగా పొలిటికల్‌గా ఉంది.

వైఎస్ఆర్ టీపీ సాంగ్

వైఎస్ఆర్ టీపీ సాంగ్


బతుకమ్మ పాటను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రిలీజ్ చేసింది. ఆ పార్టీ సాంస్కృతిక విభాగం సమర్పణలొ పాటను రూపొందించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న సాహిత్యాన్ని, గాత్రాన్ని సమకూర్చారు. అధినేత్రి షర్మిలతోపాటు.. పార్టీ నేతలు, కళాకారులు ఈ పాటలో నటించారు. ప్రభత్వంపై విమర్శలు జడివాన కొనసాగింది.

నిరసనల పర్వం..

నిరసనల పర్వం..

ఇటు హుజూరాబాద్‌ ప్రతాపవాడతో మహిళలు వినూత్న రీతిలో బతుకమ్మ ఆడారు. సిలిండర్ ధరల పెరుగుదలను నిరసిస్తూ మధ్యలో గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మ ఆడారు. గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. గ్యాసుల ధరలు పెంచారు ఉయ్యాల్లో.. గరీబు చేస్తున్రు ఉయ్యాలో.. పెట్రోల్‌ ధర పెంచి ఉయ్యాల్లో ప్రాణాలు తీస్తున్రు ఉయ్యాల్లో.. కేంద్రం మోసాలు ఉయ్యాలో.. ఇక చెల్లనియ్యం ఉయ్యాల్లో' అంటూ పాటలు పాడారు. బతుకమ్మల మధ్యలో సిలిండర్‌ పెట్టి ఆటలాడిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంటగ్యాసు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కట్టెలపొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయేమోనని మహిళలు అంటున్నారు.

వైరల్

వైరల్

మరోవైపు ఉద్యోగాలకు సంబంధించి బతుకమ్మ పాట ఒకటి వైరల్ అయ్యింది. మరో పాటలో ఈటలకు ఓటు వేయాలని ట్రోల్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా మరో సాంగ్ ట్రై చేసింది. మరోవైపు తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను తీశారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయగా.. ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చారు. ఆ పాటను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డైరెక్టర్ గౌతమ్ మీనన్‏తో కలిసి విడుదల చేశారు. అల్లిపూల వెన్నెల సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. తన మ్యూజిక్ మాయతో ఏఆర్ రెహామాన్.. గౌతమ్ మీనన్ ప్రేక్షకులను మాయ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. రకరకాల పువ్వులను పేర్చి... అమ్మవారిగా తలచి పూజిస్తూ.. ఆడుతూ పాడుతూ జరుపుకునే ఈ పండగను సంబరంగా జరుపుకుంటారు.

విమర్శలు

విమర్శలు

జాగృతి రూపొందించిన పాటపై కాస్త విమర్శలు వచ్చాయి. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసిన.. ఇక్కడి రుచి, వాసన లేదని పెదవి విరుస్తున్నాయి. నిజానికి పాటలో తెలంగాణం ఎక్కడ కనిపించలేదు కూడా.. పాట కూడా స్లోగా ఉండటం కాస్త నిరాశకు గురిచేసింది.

English summary
ysrtp party released batukamma song in recently. sharmila and other leaders are acted that song.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X