పుస్తక రూపంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్: ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్..!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం రోజున నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 100 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంస్థ ఇటీవలే "ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్: మన్ కీ బాత్ @ 100" అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది.అక్టోబర్ 2014లో ప్రారంభమైన ప్రధాని మోదీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ప్రజల్లోకి ఎలా దూసుకెళ్లింది, ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేదానిపై మూడవ విడతగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది.
పుస్తకంలో ముందుమాటగా ప్రధాని మోదీ చాలా గొప్పగా ఈ కార్యక్రమం గురించి ప్రస్తావించారు.ఒక రేడియో కార్యక్రమంగా ప్రారంభమైన మన్ కీ బాత్ ఎపిసోడ్ క్రమంగా ఒక దేశ గొంతుకగా మారిందని అన్నారు. ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా ఎలాంటి టర్న్‌లు తీసుకుందనేదానిపై వివరించారు. నిత్యం రాజకీయాలు, పరిపాలనతో బిజీగా గడుస్తున్న జీవితంలో స్ఫూర్తినిచ్చే కొందరి జీవితగాథలను, దేశం యొక్క గొంతుకను, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారి స్థితిస్థాపకత యొక్క కథలను వివరించేందుకు మన్ కీ బాత్ ఒక చక్కటి వేదికగా నిలిచిందని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

Not Just a Radio Programme, #MannKiBaat Has Given Voices to People from the Grassroots: PM @narendramodihttps://t.co/6Zfwu2U7mE
— PMO India (@PMOIndia) October 18, 2023
via NaMo App pic.twitter.com/JpsRaZPUHF
ఇక "ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్: మన్ కీ బాత్ @ 100" అనే ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు ఒక చారిత్రాత్మక పుస్తకంగా నిలుస్తుంది.భవిష్యత్ తరాల పాఠకులకు, పరిశోధకులకు, వ్యాసకర్తలకు ఈ పుస్తకం కచ్చితంగా ఒక రెఫరెన్స్‌లా ఉపయోగపడుతుంది.ఈ పుస్తకంలో వ్యాసాలు,రచనలు, కథనాలు కలగలిపి ఉన్నాయి. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపింది, దేశ ప్రజల గొంతుకను వినిపించడంలో ఎలా సక్సెస్ అయ్యిందనే అంశాల గురించి మాట్లాడుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు జరుగుతున్న పరిశోధన సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా తమతో మాట్లాడి తన ఆలోచనలను పంచుకున్నందుకు పుస్తక రచయితలు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ పుస్తకంలో ప్రధాని దేశ ప్రజల యొక్క గొంతును వినిపించారని కొనియాడారు.
2014లో ప్రారంభమైన మన్ కీ బాత్ 100 ఎపిసోడ్‌ల ప్రయాణంకు సంబంధించి వస్తున్న మూడవ సిరీస్ పుస్తకం.23 కోట్ల మంది ప్రజలు రేడియోలో ఈ కార్యక్రమం వింటుండగా.. 96శాతం మందికి ఈ కార్యక్రమంపై అవగాహన ఉంది.దేశ పౌరులతో ప్రధాని మోదీ ఒక రేడియో కార్యక్రమం ద్వారా నేరుగా మాట్లాడేందుకు మన్ కీ బాత్ ఒక చక్కటి వేదికగా నిలిచింది. ఇక ఈ పుస్తకం మొత్తం 4 సెక్షన్లుగా విభజించారు. మొత్తం 19 చాప్టర్లుండగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడిన పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపర్చారు.ఇలాంటి అంశాల్లో సామాజిక మార్పు, భారత దేశం యొక్క భిన్న సంస్కృతులు, గణాంకాలు, వ్యూహాలు వంటివి ప్రచురించారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపించే అధినేత ప్రజలతో సంభాషించి వారి జీవితాలను తెలియపరిచే ఒక ప్రత్యేక కార్యక్రమంగా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ గుర్తింపు పొందింది. ప్రధాని మోదీ అంతరంగం నుంచి వచ్చే మాటలు, పౌరులతో మాట్లాడే విధానం గురించి ప్రత్యేకంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.మహిళా సాధికారత, నీటి సంరక్షణ,స్వచ్ఛత,స్వావలంబన,సైన్స్, ఆరోగ్యం,సంస్కృతి మరియు క్రీడలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ ఏం మాట్లాడారు అనేది ఈ పుస్తకంలో పొందుపర్చారు.
దేశాన్ని ఏకం చేసే ఈ కార్యక్రమంను ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించి చేయడాన్ని స్వాగతించారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ప్రజలతో ప్రధాని మోదీ కనెక్ట్ అయ్యేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు. బ్లూక్రాఫ్ట్ సంస్థ తీసుకురానున్న "ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్: మన్ కీ బాత్ @ 100" పుస్తకాన్ని ముందస్తుగానే ఒక కాపీ తనకు అందిందని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. కలిసికట్టుగా దేశం సాధించిన విజయాలను ఈ పుస్తకంలో పొందుపర్చడం జరిగిందని దేశ పౌరుల యొక్క స్ఫూర్తిని ఇందులో హైలైట్ చేయడం జరిగిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. నూతన భారతదేశ నిర్మాణంలో మోదీ విజనరీ కీలక పాత్ర పోషించిందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని పిలుపునిచ్చిన రాజ్ నాథ్ సింగ్ ముఖ్యంగా యువత చదవాలని సూచించారు. ఎందుకంటే భారత భవిష్యత్ నిర్మాణం ఈ యువత చేతిలోనే ఉందన్నారు.
Received an advance copy of 'Igniting Collective Goodness: Mann Ki Baat @ 100', published by @bluekraft. The success of 'Mann Ki Baat' reflects PM Shri @narendramodi's exceptional connection with the people of India. Through his interactions, Modi ji has fostered a collective… pic.twitter.com/a80WTh9nMZ
— Rajnath Singh (@rajnathsingh) October 18, 2023
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పుస్తక రూపంలో తీసుకురావడాన్ని స్వాగతించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా . ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలన్నారు.ప్రతి అంశం గణాంకాలతో, సరైన సమాచారంతో పొందుపర్చబడిందని అమిత్ షా ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని రూపొందించి విడుదల చేసిన బ్లూ క్రాఫ్ట్ సంస్థను అమిత్ షా అభినందించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని చెబుతూ మన్ కీ బాత్ అనే కార్యక్రమం నూతన యుగంలో ఒక ఉద్యమంలా సాగిందని చెప్పారు.
The new book 'Igniting Collective Goodness: Mann Ki Baat @ 100' tells the story of a unique journey undertaken by our nation under the leadership of PM @narendramodi Ji. It sheds new light on how Modi Ji with the sheer power of his words rallied the nation behind common goals of… pic.twitter.com/gBMAEMgtcv
— Amit Shah (@AmitShah) October 17, 2023
మన్ కీ బాత్ పై రూపొందించిన పుస్తకం కాపీని అందుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.ఏప్రిల్ 2023లో మన్ కీ బాత్ 100 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పిన నిర్మలమ్మ.. ఈ కార్యక్రమం చాలామందిలో స్ఫూర్తిని నింపిందని కొనియాడారు.
Received a copy of a book on “Mann Ki Baat.” Chronicles the remarkable journey of the @airnewsalerts which reached 100 episodes in April’23.
— Nirmala Sitharaman (@nsitharaman) October 18, 2023
Small, self-motivated good deeds of nation building have found recognition in the words of @PMOIndia, one Sunday each month.
Indeed… pic.twitter.com/iESegwxOoc
ఇక మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మాట్లాడుతూపరిష్కారాలు, తీర్మానాలు, ఫలితాల సమ్మేళనమే "ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్: మన్ కీ బాత్ @ 100" అనే పుస్తకమని చెప్పారు. దేశ ప్రజలకు ప్రధానికి మధ్య జరిగిన సంభాషణ ఒక పుస్తక రూపంలో కచ్చితంగా ఉండాలన్నారు.దేశం నిర్మాణం కోసం దేశాభివృద్ధి కోసం పలువురు వ్యక్తులు చేసిన త్యాగాలు, సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు.
An amalgamation of resolves , resolutions and results . A dialogue between a people and their Prime Minister- Igniting Collective Goodness is a must have . It celebrates the quintessential capacities of individual citizens who are humane ,their journeys of service and sacrifice. pic.twitter.com/yDYwKIRZGY
— Smriti Z Irani (@smritiirani) October 19, 2023
ఈ పుస్తక శ్రేణిలో తొలి పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2017 మే నెలలో విడుదల చేశారు.ఆ సమయంలో మన్ కీ బాత్ 26 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.ఇక రెండవ పుస్తకం మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2019 మార్చిలో విడుదల చేశారు. ఆ సమయంలో మన్ కీ బాత్ 50 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. 'Igniting Collective Goodness: Mann ki Baat @ 100' అనే ఈ పుస్తకం ముందస్తు ఆర్డర్ కోసం ప్రముఖఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో సంప్రదించొచ్చు. ఈ పుస్తకాన్ని వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ లిమిటెడ్ ప్రచురించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications