• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తొలి టీ20 రేపే: టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో భారీ మార్పులు: ఓపెనర్‌గా ఐపీఎల్ టాప్ స్కోరర్

|

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు.. ఇక మలిదశ సిరీస్‌లో అడుగు పెట్టబోతోంది. శుక్రవారం నుంచి టీ20 ఫార్మట్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్ ఇది. తొలి మ్యాచ్ క్యాన్‌బెర్రాలోని మనూకా ఓవల్ స్టేడియంలో ఆరంభం కాబోతోంది. 6, 8వ తేదీల్లో చివరి రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ రెండింటికీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మారబోతోంది. ఇదే క్యాన్‌బెర్రా స్టేడియంలో చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుపై సాధించిన ఘన విజయంతో ఆత్మవిశ్వాసంలో కనిపిస్తోంది టీమిండియా.

బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు..

బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు..

వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతో పోల్చుకుంటే.. టీ20 ఫార్మట్ భిన్నంగా ఉంటుంది. ఆడబోయేది 20 ఓవర్లే కావడంతో ఎంత భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగితే.. అంత విజయానికి దగ్గరైనట్టుగా భావిస్తారు క్రికెటర్లు. అందుకే దూకుడుగా ఆడుతుంటారు. బంతిని వృధాగా పోనివ్వరు. ఎలాంటి బంతినైనా భారీ షాట్ ఆడటానికే ప్రాధాన్యత ఇస్తారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో టీ20ల్లో ఆస్ట్రేలియాను పరాజయంపాలు చేయడానికి టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాలను రూపొందిస్తోంది. బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది.

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్..

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్..

టీ20 సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు. శిఖర్ ధావన్‌తో కలిసి కేఎల్ రాహుల్ టీమిండియా ఇన్నింగ్‌ను ఆరంభించడానికే అత్యధిక అవకాశాలు ఉన్నాయి. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయం వల్ల ఆసీస్ టూర్‌కు దూరమైన ప్రస్తుత పరిస్థితుల్లో వన్డేల్లో మయాంక్ అగర్వాల్-శిఖర్ ధావన్‌లో జోడీ ఇన్నింగ్‌ను ఆరంభించింది. టీ20ల్లో మయాంక్‌కు బదులుగా కేఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేయించాాలని టీమిండియా భావిస్తోంది.

ఐపీఎల్-2020 టాప్ స్కోరర్‌గా..

ఐపీఎల్-2020 టాప్ స్కోరర్‌గా..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో కేఎల్ రాహుల్ ఏ రేంజ్‌లో ఆడాడు తెలిసిన విషయమే. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన అతను ఓపెనర్‌గా భారీ స్కోర్‌ను సాధించాడు. ఐపీఎల్-2020 సీజన్ మొత్తానికీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. 14 మ్యాచుల్లో 670 పరుగులు చేశాడు రాహుల్. అత్యధిక స్కోరు 132. అయిదు హాఫ్ సెంచరీలు చేశాడు. అతని స్టైక్ రేట్ 55.83గా నమోదైంది. ఐపీఎల్‌లో అన్ని మ్యాచుల్లోనూ ఇన్నింగ్‌ను ఆరంభించాడు. సో- అదే ఫ్లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 మ్యాచుల్లోనూ కొనసాగించగలడని నమ్ముతోంది మేనేజ్‌మెంట్.

దీపక్ చాహల్ ఆడే ఛాన్స్?

దీపక్ చాహల్ ఆడే ఛాన్స్?

శుక్రవారం క్యాన్‌బెర్రాలో జరిగే టీ20 మ్యాచ్‌లో దీపక్ చాహల్ కూడా ఆడే అవకాశాలు లేకపోలేదు. మహ్మద్ షమీ, టీ నటరాజన్‌లకు తోడుగా దీపక్ చాహల్‌ను ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేడా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండటం వల్ల కొంతమేరకైనా ఆస్ట్రేలియా క్రికెటర్ల దూకుడును అడ్డుకోవడానికి పేస్ బౌలర్లకు జట్టులో ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. చివరి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసి, జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన నటరాజన్‌ ఇక టీ20ల్లో అరంగేట్రం ఖాయమైనట్టే.

English summary
KL Rahul, who bats in the middle-order in ODIs, is all but confirmed to open the innings. He opened the innings in T20Is and was back to number 5 in ODIs. Rahul has an impressive record as an opener in the shortest format. Rahul won the Orange Cap in IPL 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X