96 ఏళ్ల నాటి టెస్ట్ క్రికెట్ చరిత్రను తిరగరాసిన టీమిండియా .. 1924 తరువాత తొలిసారిగా: ఏంటా చెత్త రికార్డు?

అడిలైడ్: టెస్ట్ క్రికెట్‌లో కొన్ని చెరిగిపోని రికార్డులు, మరిచిపోలేని విజయాలను అందుకున్న భారత క్రికెట్ జట్టు.. అదే రేంజ్‌లో పరాజయాన్ని కూడా మూటగట్టుకునే స్థాయికి దిగజారింది.. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో. 36 పరుగులకే బ్యాటింగ్ లైనప్ కూలిపోయింది. ఆస్ట్రేలియా పేసర్ల ముందు నిలవలేకపోయింది. తొలిసారిగా క్రికెట్ ఆడుతోన్న ఫీలింగ్..జట్టు ఆటగాళ్లలో కనిపించింది. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో నిప్పులు చెరిగే బంతులను సంధించిన ఆసీస్ పేస్ బౌలర్ల దాడిని ఎదుర్కొన లేకపోయింది. ఈ క్రమంలో- 95 సంవత్సరాల నాటి ఓ రికార్డును బద్దలు కొట్టింది.

27 పరుగులకే తొమ్మిది వికెట్లు..

27 పరుగులకే తొమ్మిది వికెట్లు..

ఒక వికెట్ నష్టానికి తొమ్మది పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడోరోజు ఇన్నింగ్‌ను ఆరంభించిన కోహ్లీసేన.. ఆసీస్ పేసర్ల ధాటికి చెల్లాచెదురైపోయింది. కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. 11వ ఓవర్‌లో రెండో బంతికి చేతేశ్వర్ పుజారా అవుటైన తరువాత ప్రారంభమైన వికెట్ల పతనం. బ్రేకుల్లేకుండా సాగింది. చివరి తొమ్మిది వికెట్లను 27 పరుగులకే కోల్పోయింది. ఈ క్రమంలో రెండు చెత్త రికార్డులను నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 19 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయిన జట్టు ఇప్పటిదాకా ఏదీ లేదు.

1924 తరువాత తొలిసారిగా..

1924 తరువాత తొలిసారిగా..

ఒక ఇన్నింగ్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును నమోదు చేయకుండానే అవుట్ కావడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 96 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1924లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ట మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇలాంటి స్కో‌ర్ కార్డ్ కనిపించింది. బర్మింగ్‌హామ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు డబుల్ డిజిట్ స్కోరును చేయలేకపోయారు. ఆ మ్యాచ్‌లో హెర్బీ టేలర్ ఒక్కడిదే అత్యధిక స్కోరు. అతను ఏడు పరుగులు చేశాడు. ఎక్స్‌ట్రాలు 11. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగులకే ఆలౌట్ అయింది.

 పుజారా టు అశ్విన్..నో బ్రేక్

పుజారా టు అశ్విన్..నో బ్రేక్

ఇన్నేళ్ల తరువాత అలాంటి చెత్త రికార్డను అందుకుంది టీమిండియా. ఒక వికెట్ నష్టానికి తొమ్మది పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడోరోజు ఇన్నింగ్‌ను ఆరంభించిన కోహ్లీసేన.. ఆసీస్ పేసర్ల ధాటికి చెల్లాచెదురైపోయింది. 11వ ఓవర్‌లో రెండో బంతికి చేతేశ్వర్ పుజారా అవుటైన తరువాత ప్రారంభమైన వికెట్ల పతనం. బ్రేకుల్లేకుండా సాగింది. 19 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. పుజారా-0, మయాంక్ అగర్వాల్-9, జస్‌ప్రీత్ బుమ్రా-2, విరాట్ కోహ్లీ-4, అజింక్య రహానె-0, హనుమ విహారి-8, వృద్ధిమాన్ సాహా-4, రవిచంద్రన్ అశ్విన్-0 వెంటవెంటనే అవుట్ అయ్యారు. ఒక పరుగు చేసిన మహ్మద్ షమీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరగ్గా.. ఉమేష్ యాదవ్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+