వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊచకోత: తోక ముడిచిన కోహ్లీసేన: గల్లీ క్రికెటర్ల కంటే హీనం: టెస్ట్ చరిత్రలో దారుణ రికార్డ్

|
Google Oneindia TeluguNews

అడిలైడ్: టీమిండియా. ఆధునిక క్రికెట్‌ను శాసిస్తోన్న ఏకైక జట్టు. భారత క్రికెట్ జట్టు పర్యటనకు వస్తోందంటే.. దాన్ని అలెగ్జాండర్ దండయాత్రగానే భావిస్తుంటాయి ఆయా దేశాల క్రికెట్ జట్లు. ఒళ్లు దగ్గర పెట్టుకుంటాయి. ఆచి తూచి జట్టును ఎంపిక చేస్తుంటాయి. అలాంటి ఘనత వహించిన టీమిండియా.. ఆస్ట్రేలియా గడ్డ మీద తోక ముడిచింది. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి కుప్పకూలిపోయింది. అత్యంత దారుణ రికార్డ్‌ను నెలకొల్పింది. ఆధునిక క్రికెట్‌లో ఇంత ఘోరంగా వికెట్లను ప్రత్యర్థికి సమర్పించుకున్న జట్టు మరొకటి లేదు.. బహుశా ఇక రాదేమో.

Recommended Video

Ind vs Aus 1st Test: India Record Lowest Test score 36/9, Australia Humiliate India at Adelaide

తొమ్మిది పరుగులకు ఒక వికెట్ ఓవర్ నైట్ స్కోర్‌తో మూడోరోజు ఇన్నింగ్‌ను ఆరంభించిన కోహ్లీసే.. ఆసీస్ పేసర్ల ధాటికి చెల్లాచెదురైపోయింది. 11వ ఓవర్‌లో రెండో బంతికి చేతేశ్వర్ పుజారా అవుటైన తరువాత ప్రారంభమైన వికెట్ల పతనం. బ్రేకుల్లేకుండా సాగింది. 19 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. 19 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయిన జట్టు ఇప్పటిదాకా ఏదీ లేదు. జింబాబ్వే లాంటి పసికూన జట్లు కూడా ఇదివరకెప్పుడూ ఇంత దారుణంగా వికెట్లను సమర్పించుకోలేదు.

India vs Australia 1st Test: Here is Indias Lowest Test Score In An Innings

టీమిండియాలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే టాప్ స్కోర్..అంటే నమ్మాలి మరి. డబుల్ డిజిట్‌ను ఏ బ్యాట్స్‌మెన్ కూడా అందుకోలేపోయాడు. మొబైల్ ఫోన్ నంబర్లను తలపించే స్కోర్‌ను రికార్డు చేసింది టీమిండియా. ఇన్నింగ్ బ్రేక్ తీసుకునే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి కోహ్లీ సేన చేసిన స్కోర్ 36 పరుగులు మాత్రమే. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్ ఆరంభించడానికి కావాల్సిందే సింగిల్ వికెట్. తొమ్మిది మంది అవుట్ కాగా.. వారిలో ఏ ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్‌ను అందుకోలేకపోవడం బ్యాటింగ్ లైనప్ పతనానికి అద్దం పడుతోంది.

India vs Australia 1st Test: Here is Indias Lowest Test Score In An Innings

నిప్పులు చెరగిన బంతులకు అసలు సిసలు నిర్వచనం ఇచ్చారు ఆస్ట్రేలియా పేస్ బౌలర్లు. ప్యాట్ కమ్మిన్స్, హేజిల్‌వుడ్ చెలరేగిపోయారు. ఇద్దరు వికెట్లను పంచుకున్నారు. అయిదు ఓవర్లలో ఎనిమిది పరుగులను మాత్రమే ఇచ్చి అయిదు వికెట్ల హాల్‌ను అందుకున్నాడు హేజిల్‌వుడ్. 10 ఓవర్లలో 21 పరుగులకు నలుగురిని పెవిలియన్ చేర్చాడు పాట్ కమ్మిన్స్. వారిద్దరి ధాటికి ఎలా ఆడాలో కూడా మర్చిపోయినట్టు కనిపించారు టీమిండియా బ్యాట్స్‌మెన్లు. ఇంత అత్యల్ప స్కోర్‌ను ఇకముందు చూడలేమంటూ టీమిండియా మాజీ క్రికెటర్లు చెబుతున్నారంటే దాని తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

English summary
India record their lowest Test score, Australia need 90 to win. The Indian players are going off the field. Australia needs 90 runs to win the first Test. Hazlewood has Hanuma Vihari caught behind by Paine. India 31/9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X