వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ ప్రేమికులకు షాకిచ్చిన గుజరాత్: ఇక ప్రేక్షకులు లేకుండా ఇంగ్లాండ్ సిరీస్: డబ్బులు..?

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: రసవత్తరంగా సాగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్‌లో.. అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఫలితంగా- ఈ సిరీస్‌లో ఇక మిగిలిన మ్యాచ్‌లన్నింటినీ క్లోజ్డ్ డోర్స్ మధ్య నిర్వహించనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వట్లేదని తెలిపింది. గుజరాత్‌లో రోజురోజుకూ పెరుగుతోన్న ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. ప్రేక్షకులు కొనుగోలు చేసిన టికెట్ల మొత్తాన్ని రీఫండ్ చేస్తామని స్పష్టం చేసింది.

కరోనా ఎఫెక్ట్..

దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. రెండో విడత పెరుగుదల ఆరంభంలో మహారాష్ట్రకే పరిమితమైన కేసుల సంఖ్య.. క్రమంగా పొరుగునే ఉన్న గుజరాత్‌కు కూడా పాకింది. అక్కడా రోజువారీ కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల్లో 890 కేసులు నమోదు అయ్యాయి. కొద్దిరోజులుగా నమోదైన కేసులతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైన దాఖలాల్లేవు.

 ఆడియన్స్ లేకుండా..

ఆడియన్స్ లేకుండా..


ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య కొనసాగుతోన్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. నిజానికి- నరేంద్ర మోడీ స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం వరకు మాత్రమే ప్రేక్షకులకు అనుమతి ఇస్తోన్న విషయం తెలిసిందే.

డబ్బులు రీఫండ్..

డబ్బులు రీఫండ్..

లక్షా 10 వేల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్‌లను తిలకించే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించడానికి 60,000 నుంచి 70,000 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. తొలి టీ20- 67,532, రెండో టీ20-66,000 మంది ప్రేక్షకులు తిలకించారు. మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం ఇప్పటికే టికెట్లను విక్రయించింది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకుల టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తామని తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ధన్‌రాజ్ నత్వానీ ఓ ప్రకటన విడుదల చేశారు.

 ఈ సాయంత్రమే మూడో మ్యాచ్..

ఈ సాయంత్రమే మూడో మ్యాచ్..

టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ నరేంద్ర మోడీ స్టేడియమే ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇందులో రెండు ముగిశాయి. తొలి మ్యాచ్‌‌ను ఇంగ్లాండ్ ఎగరేసుకెళ్లగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. మూడో మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. గురు, శనివారాల్లో చివరి రెండు మ్యాచ్‌లు ఉంటాయి. ఇక ప్రేక్షకుల హర్షధ్వానాలు ఈ స్టేడియంలో వినిపించవు. మ్యాచ్‌లను చూడటానికి టీవీలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ భారత్, ఇంగ్లాండ్ చెరో రెండు మ్యాచ్‌లను నెగ్గడంతో.. సిరీస్ ఉత్కంఠభరితంగా మారింది.

English summary
The remaining T20 International matches between India and England will be played without an audience at Narendra Modi Stadium in Ahmedabad and a refund will be given to the spectators who have purchased tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X