మాజీ ఉద్యోగిని లింగ వివక్ష కేసు: విప్రోకి ఊరట
లండన్: తమ సంస్థలో ఉద్యోగుల పట్ల లింగ వివక్ష చూపుతున్నారంటూ దాఖలైన కేసులో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు ఊరట లభించింది. లండన్‌లోని తమ కార్యాలయంలో మార్కెట్ డెవలప్‌మెంట్ మేనేజరుగా పనిచేసిన శ్రేయా ఉకిల్ వేసిన కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని విప్రో తెలిపింది.
పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వకుండా సంస్థ వివక్ష చూపుతోందని, పైగా కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ.. అందుకు పరిహారంగా 1.2 మిలియన్ పౌండ్లను (సుమారు 11 కోట్ల 60 లక్షల రూపాయలు) చెల్లించాలని కోరింది. ఈ మేరకు శ్రేయా ఉకిల్ బ్రిటన్ ఎంప్లాయీస్ ట్రైబ్యునల్‌లో కేసు వేయడం జరిగింది.

అయితే, కంపెనీ నియమ నిబంధనలను పాటించనందునే శ్రేయాతో పాటు మరో ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించడం జరిగిందని, ఇందులో వివక్ష అన్నది లేనేలేదని విప్రో వాదించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ట్రైబ్యునల్ తమ వాదనను సమర్థిస్తూ, తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్రో వెల్లడించింది.
కాగా, ఇప్పటికైనా మహిళలను సమానంగా చూడాలని, సమాన వేతనాలు చెల్లించాలని ఉకిల్ కోరుతున్నారు. ఈ తీర్పు కంపెనీకి పూర్తి అనుకూలంగా ఏమీ లేదని, మహిళలు సమాన హక్కుల కోసం పోరాడేందుకు ఈ తీర్పు దోహదం చేస్తుందని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications