బంపర్ ఆఫర్:1800 టెక్కీలకు కోటికి పైగా వేతనాలిస్తున్న ఇన్పోసిస్

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు:టెక్ దిగ్గజం ఇన్పోసిస్ విదేశీ ఉద్యోగులకు భారీగా వేతనాలను చెల్లిస్తోంది. అంతర్జాతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న 1800 మందికిపైగా ఉద్యోగులు కోటికి పైగా వేతనాలను ఆర్జిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా సాప్ట్ వేర్ మందగమనంలో కొనసాగుతన్నట్టు నిపుణులు చెబుతున్నారు.అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.

ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలపై అమెరికా ప్రభావం తీవ్రంగా పడింది.కొన్ని కంపెనీలు ఖర్చులను తగ్గించుకొనే పనిలోపడ్డాయి.అయితే ఇదే సమయంలో ఇన్పోసిస్ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు మాత్రం భారీగా వేతనాలు చెల్లిస్తోంది.

అయితే కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకొనే పనిలో ఉంటే ఇన్నోసిస్ ఎలా ఉద్యోగులకు భారీ ఎత్తున వేతనాలు చెల్లిస్తోందనే ప్రశ్నలు కూడ ఉత్పన్నమౌతున్నాయి.

1800 మందికి కోటికి పైగా వేతనాలు

1800 మందికి కోటికి పైగా వేతనాలు

1800 మంది ఉద్యోగులకు కోటికి పైగా వేతనాలను చెల్లిస్తున్నట్టు ఇన్పోసిస్ ప్రకటించింది. గత ఆర్తిక సంవత్సరమే వీరిని ఇన్పోసిస్ నియమించుకొంది.అయితే దేశీయ ఉద్యోగులకు కాకుండా అంతర్జాతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న వారికే భారీ మొత్తంలో వేతనాలను చెల్లిస్తోంది. అభివృద్ది చెందిన మార్కెట్లలో ఉద్యోగులను మరింత విస్తరిస్తున్న క్రమంలోనే ఈ వ్యయం కంపెనీకి మరిన్ని సవాళ్ళను తీసుకురానుందని రిపోర్ట్ లు వెల్లడిస్తున్నాయి.

విదేశీ ఉద్యోగులకే కోటికి పైగా వేతనాలు

విదేశీ ఉద్యోగులకే కోటికి పైగా వేతనాలు

2017 ఆర్థికసంవత్సరంలో కేవలం 50 మంది భారతీయ ఉద్యోగులకు మాత్రమే కోటికిపైగా వేతనాలు చెల్లించేది. ఈ సంఖ్య 2015 ఆర్థిక సంవత్సరంలో 113 నుండి 117 మద్యలో ఉండేది. భారత్ లో ఇన్పోసిస్ కు 1,51,956 మంది ఉద్యోగులున్నారు. అంతర్జాతీయంగా మాత్రం 48,400 మంది ఉన్నారు. విదేశీ ఉద్యోగులకు మాత్రమే ఇన్పోసిస్ భారీగా వేతనాలు చెల్లిస్తోంది. ఇప్పటికే 1800 మందికి పైగా విదేశీ ఇన్పోసిస్ ఉద్యోగులు కోటీశ్వరులయ్యారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

విదేశీ కరెన్సీలో ఉద్యోగులకు చెల్లింపు

విదేశీ కరెన్సీలో ఉద్యోగులకు చెల్లింపు

విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు విదేశీ కరెన్సీలోనే వేతనాలు చెల్లిస్తున్నారు.దీంతో వారికి భారీగా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కంపెనీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.2016లో నియమించుకొన్న మాదిరిగానే అంతర్జాతీయ కేంద్రాల్లో 2017లోనూ ఉద్యోగ నియమకాలు చేపట్టిందన్నారు. ఈ రెండేళ్ళలో కూడ సగటు వేతనాలు సిద్దంగా ఉన్నాయని ఇన్పోసిస్ ప్రకటించింది.

అమెరికాలో మరో 10వేల మందికి ఉద్యోగాలు

అమెరికాలో మరో 10వేల మందికి ఉద్యోగాలు

అమెరికా నియామక వ్యూహాలతో ఈ పెంపు ప్రభావం ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే వీటితో మార్జిన్ గైడెన్స్ ను తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. గతనెలలో ఇన్పోసిస్ అమెరికాలో 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది.అతిపెద్ద మార్కెటింగ్ అయిన అమెరికాలో ట్రంప్ అద్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రక్షణాత్మక విధానాలు విపరీతంగా పెరగడం , మరోవైపు ఒక్క ఇన్పోసిస్ మాత్రమే కాక ఆన్ షోర్ నియామకాల వ్యయాలను దేశీయ ఐటీ ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఎదుర్కొంటోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Infosys paying over RS 1 crore to more than 1,800 employees in its overseas locations
Please Wait while comments are loading...