వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీత దాటిన పైలట్లపై వేటు : ముగ్గురిని సస్పెండ్ చేసిన డీజీసీఏ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎయిర్ పోర్ట్‌లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు పైలట్లపై విమానయాన సంస్థ వేటువేసింది. వీరిలో ఇద్దరు ప్రైవేట్ విమాన సంస్థకు చెందిన పైలట్ ఉండగా, ఒకరు ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్ అని సివిల్ ఏవియేషన్ పేర్కొన్నది. వీరిని ఆర్నెల్లపాటు విధుల నుంచి బహిష్కరిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. వీరితోపాటు ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది ఒకరిని కూడా విధుల నుంచి తప్పించినట్టు వెల్లడించింది.

1 Air India, 2 SpiceJet Pilots Suspended For Violating Safety Rules

అరతి గుణశేఖరన్, సౌరభ్ గులియా అనే ఇద్దరూ ఫైలట్లు విమానయాన సంస్థ నిబంధనలను అతిక్రమించారని పేర్కొంది. రన్ వే పై ఉన్న చివరి లైట్లను ధ్వసం చేశారని తెలిపింది. ఈ నెల 2వ తేదీని పుణె నుంచి కోల్ కతా వెళ్తున్న విమానం రన్ వే ఎడ్జ్ మీదికి వెళ్లిందని వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు డీజీసీఏ గుర్తుచేసింది. రన్ వే ను ధ్వంసం చేసినందుకు వారిపై చర్యలు తీసుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వారిపై ఆర్నెల్లపాటు సస్పెన్షన్ అమల్లో ఉంటుందుని వెల్లడించింది. ఆ తర్వాత వారి ప్రవర్తన ఆధారంగా సర్వీసులోకి తీసుకునే అంశాన్ని పరిగణిస్తామని సూచించింది. ముగ్గురు పైలట్లలో ప్రభుత్వ విమానయాన సంస్థ పైలట్ కూడా ఉండటం గమనార్హం. నియమ, నిబంధనలను అతిక్రమించిన వారు ఎవరైనా ఉపేక్షించబోమని డీజీసీఏ తన చర్యలతో స్పష్టంచేసింది.

English summary
Three pilots were on Tuesday suspended by civil aviation watchdog, the Directorate General of Civil Aviation, for violating safety norms, news agency ANI reported. While one pilot is from national carrier Air India, two are from private operator SpiceJet, the agency added.A member of Air India's cabin crew was also suspended, the agency reported. The flying licences of two SpiceJet pilots was suspended for six months after an aircraft operated by them damaged runway edge lights during landing at Kolkata airport, a senior official told news agency PTI. The incident took place on July 2 when the plane was operating a Pune-Kolkata flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X