గత 25 ఏళ్లలో భారత్‌లో సంభవించిన 10 అతి భయంకరమైన తుఫాన్లు ఇవే

న్యూఢిల్లీ: బిపార్జోయ్ తుపాను ఇప్పుడు గుజరాత్ బీభత్సం సృష్టిస్తోంది. భయంకరమైన గాలులు, భారీ వర్షాలతో గుజరాత్ రాష్ట్రంలోని తీర ప్రాంతాలు అల్లాడుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రతోపాటు ఈ తుపాను ప్రభావం దేశంలోని మరో 8 రాష్ట్రాలపైనా ఉండనుంది. గురువారం రాత్రి ఈ తుపాను గుజరాత్ తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల్లోని సుమారు లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాగా, భారత తీరప్రాంతాల్లో తుపానుల కారణంగా సంభవించే విధ్వంసం కొత్త విషయమేమీ కాదు. తుఫాను కారణంగా ఇళ్లు ధ్వంసమై, పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, స్థానభ్రంశం సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. గత 25 ఏళ్లలో సంభవించిన అతి పెద్ద తుఫానులలో కొన్నింటిని పరిశీలిద్దాం.

జూన్, 1998 (గుజరాత్ సైక్లోన్)
జూన్ 4, 1998న వచ్చిన ఈ సముద్ర తుఫాను భయంకరమైన విధ్వంసం సృష్టించింది. కాండ్లా ఓడరేవు వద్ద తుపాను తీరం దాటింది. గుజరాత్‌లోని పోర్‌బందర్-జామ్‌నగర్ తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పుడు జామ్‌నగర్‌లో గాలి వేగాన్ని గంటకు 182 కిలోమీటర్లుగా ఉంది. గణాంకాల ప్రకారం.. 1,173 మంది మరణించారు. 1,774 మంది తప్పిపోయినట్లు నివేదించబడింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆస్తి నష్టం రూ. 1865 కోట్ల కంటే ఎక్కువ జరిగింది.

అక్టోబర్ 1999 (సూపర్ సైక్లోన్)
భారతదేశంలో పెద్ద తుఫానుల గురించి మాట్లాడినట్లయితే.. 1999 సంవత్సరంలో ఒడిశాను తాకిన సూపర్ సైక్లోన్‌ను అగ్రస్థానంలో ఉంచవచ్చు. యాక్షన్ ఎయిడ్ ఇండియా ప్రకారం.. ఈ తుఫాను కారణంగా 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 15 లక్షల మంది దీని బారిన పడ్డారు. ఈ సూపర్ సైక్లోన్ ఒడిశాలో విపరీతమైన విధ్వంసం సృష్టించింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అదే సమయంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 లక్షలకు పైగా పశువులు మృతి చెందాయి. 16.5 లక్షల హెక్టార్లలో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి.

10 dangerous cyclonic storms hit india in 25 years; here is the details

సెప్టెంబర్ 2005 (ప్యారే తుఫాను)
బంగాళాఖాతంలో ఈశాన్యం నుంచి నైరుతి వరకు అరుదైన మార్గాన్ని ట్రాక్ చేస్తున్న సమయంలో ప్యారే తుఫాను సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో భారీ విధ్వంసం సృష్టించింది. ఈ సమయంలో, తీర ప్రాంతంలో నివసిస్తున్న 65 మంది ప్రాణాలు కోల్పోయారు.

డిసెంబర్ 2008 (నిషా తుఫాను)
నిషా బలహీనమైన కానీ తీవ్రమైన ఉష్ణమండల తుఫాను. దీని కారణంగా శ్రీలంక, భారతదేశంలో 200 మందికి పైగా మరణించారు. ఒక్క తమిళనాడులోనే నిషా కారణంగా భారీ వర్షాలు, వరదల కారణంగా 189 మంది చనిపోయారు.

అక్టోబర్ 2013 (ఫైలిన్ తుఫాను)
ఈ తుఫాను ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట నష్టాన్ని కలిగించింది. ఇది 12 అక్టోబర్ 2013న ఒడిశా తీరంలో తీరాన్ని తాకింది. ఈ తుఫాను వల్ల తొమ్మిది మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 50 మందికి పైగా మరణించారు. అలాగే 2.34 లక్షల ఇళ్లు దెబ్బతినగా, రూ. 2,400 కోట్ల విలువైన వరి పంట దెబ్బతిన్నది. ఫైలిన్ తుఫాను కేంద్రం గోపాల్‌పూర్, అక్కడి నుంచి తుఫాను గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దాటింది. దీంతో ఒడిశాలోని 12 జిల్లాలు ప్రభావితమయ్యాయి.

అక్టోబర్ 2014 (హుధుద్ తుఫాను)
హుధుద్ తుఫాను 12 అక్టోబర్ 2014న ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. దీని గరిష్ట ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కనిపించింది. అక్కడ ఇది అత్యధిక వేగంతో తాకింది. వాస్తవానికి అక్టోబర్ 8న అండమాన్ నికోబార్ దీవులకు వచ్చింది. దీని తర్వాత విశాఖ తీరాన్ని తాకినప్పుడు దాని వేగం గంటకు 215 కి.మీ. ఈ తుపాను కారణంగా దాదాపు రూ. 2000 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ తుపాను కారణంగా 124 మంది చనిపోయారు.

డిసెంబర్ 2017 (ఓఖీ తుఫాను)
భారతదేశాన్ని తాకిన శక్తివంతమైన తుఫానులలో ఓఖీ తుఫాను కూడా ఒకటి. ఈ తుపాను కేరళ నుంచి తమిళనాడు తీరాల వరకు బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా 300 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది ఇళ్లు ధ్వంసమై లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ తుపాను గంటకు 250 కిలోమీటర్ల వేగంతో సముద్ర తీర ప్రాంతాలను తాకింది.

మే 2019 (ఫాని తుఫాను)
ఒడిశా తీరాన్ని తాకిన తీవ్ర తుఫాను ఫణి. పూరీతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఆ సమయంలో గంటకు 200 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచాయి. దీంతో పెను విధ్వంసం జరిగింది. ఈ తుఫాను సుమారు 100 మందిని బలితీసుకుంది. ప్రభావిత ప్రాంతాల నుంచి కోటి మందికి పైగా ప్రజలను రక్షించారు.

మే 2020 (అంఫాన్ తుఫాను)
కరోనా కాలంలో భారతదేశంలోని బెంగాల్, ఒడిశాను అంఫాన్ తుఫాను తాకింది. ఈ తుఫాన్ వచ్చినప్పుడు, గంటకు 190 కిమీ వేగంతో బలమైన గాలులు చాలా చెట్లు, ఇళ్ళు నేలకూలాయి. ఈ తుఫాను భారతదేశంలో 98 మందిని బలితీసుకుంది. బెంగాల్, ఒడిశాకు చెందిన 5 లక్షల మందికి పైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మే 2021 (తౌక్తే తుఫాను)
మే 17, 2021న దక్షిణ గుజరాత్ తీరాలను తాకింది. ఈ తుపాను కారణంగా గంటకు 200 కి.మీ వేగంతో గాలులు వీచాయి. దశాబ్ద కాలంలో అరేబియా సముద్రాన్ని తాకిన అతి భయంకరమైన తుఫాను ఇది. ఈ తుఫాను కారణంగా భారతదేశంలో దాదాపు 24 మంది మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+