బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 10 మంది మృతి, పలువురికి గాయాలు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని విరుధునగర్ జిల్లాలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ
పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. సహాయక చర్యలు చేపట్టాయి.
వెంబకొట్టాయి పోలీసుస్టేషన్ పరిధిలోని రాము దేవన్‌పట్టిలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను విచారణ చేపట్టారు.

కాగా, బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా సమీపంలో మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు, ఈ పేలుడుపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, ఎమ్ఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
#WATCH | Explosion occurs in a firecracker manufacturing unit in Tamil Nadu's Virudhunagar; details awaited pic.twitter.com/cALcg6A9Ow
— ANI (@ANI) February 17, 2024
ఇది ఇలావుండగా, మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 వాణిజ్య యూనిట్లు, కొన్ని ఇళ్లు దగ్ధమయ్యాయి. గోవండి ప్రాంతంలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు అగ్నిమాపక దళాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపారు.












Click it and Unblock the Notifications