Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vande Bharat: రేపు ఒకే రోజు 10 వందే భారత్ రైళ్ల ప్రారంభం-హాఫ్ సెంచరీ రికార్డు..!

భారతీయ రైల్వేలో సంస్కరణల పర్వం ప్రారంభమయ్యాక అందుబాటులోకి వచ్చిన కొత్త తరం సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలు వందే భారత్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్ని దేశ రాజధానితో కలపడమే కాక, ముఖ్యమైన రాష్ట్రాల రాజధానుల్ని కూడా కలుపుతూ వీలైనన్ని ఎక్కువ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇదే క్రమంలో రేపు ఒక్క రోజే 10 వందే భారత్ రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి.

రేపు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్చువల్ విధానంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు. ఈ 10 రైళ్లు వివిధ రాష్ట్రాల్లో ప్రయాణించబోతున్నాయి. రేపు ప్రారంభం కానున్న వందే భారత్ రైళ్లలో లక్నో-డెహ్రాడూన్ వందే భారత్‌తో పాటు పాట్నా-లక్నో, న్యూ జల్‌పైగురి-పాట్నా, పూరీ-విశాఖపట్నం, కలబురగి-బెంగళూరు, రాంచీ-వారణాసి, , ఖజురహో-ఢిల్లీ వెళ్లే కొత్త సర్వీసులు ఉన్నాయి. అలాగే అహ్మదాబాద్-ముంబై, సికింద్రాబాద్-విశాఖపట్నం, మైసూరు-చెన్నై రూట్లలో వందే భారత్ రైళ్ల రెండో సెట్‌ను నడపనున్నారు.

10 New Vande Bharat Trains launch tomorrow india to cross half-century mark

వీటితో పాటు ప్రస్తుతం నడుస్తున్న నాలుగు వందే భారత్ రైళ్ల మార్గం కూడా పొడిగిస్తారు. అహ్మదాబాద్-జామ్‌నగర్ వందే భారత్ ద్వారక వరకు పొడిగించనున్నారు.అలాగే అజ్మీర్-ఢిల్లీ రైలు చండీగఢ్ వరకు, గోరఖ్‌పూర్-లక్నో రైలు ప్రయాగ్‌రాజ్ వరకు, తిరువనంతపురం-కాసర్‌గోడ్ వందే భారత్ మంగళూరు వరకు పొడిగిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ప్రధాని మోడీ ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఇందులో కత్రా-న్యూఢిల్లీ మధ్య రెండో రైలు, ఢిల్లీ-వారణాసి రెండో రైలు కూడా ఉంది. అలాగే అమృత్‌సర్-ఢిల్లీ, కోయంబత్తూరు-బెంగళూరు, మంగళూరు-మడ్గావ్, జల్నా-ముంబై, అయోధ్య-ఢిల్లీ సర్వీసులున్నాయి.

రేపు 10 సర్వీసులు ప్రారంభమైతే.. దేశవ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ రైళ్ల సంఖ్య 51కి చేరుకుంటుంది. ఈ రైళ్లు 45 రూట్లలో రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే ఒకే గమ్యస్థానాల మధ్య కనీసం ఆరు రైళ్లు నడవనున్నాయి. ఢిల్లీ-కత్రా (జమ్మూ మరియు కాశ్మీర్‌లో), ఢిల్లీ-వారణాసి (ఉత్తరప్రదేశ్‌లో), ముంబై (మహారాష్ట్రలో)-అహ్మదాబాద్ (గుజరాత్‌లో), మైసూరు (కర్ణాటకలో)-చెన్నై (తమిళనాడులో), కేరళలోని కాసరగోడ్-తిరువనంతపురం మధ్య రెండేసి రైళ్లు నడుస్తున్నాయి. రేపటి కొత్త అదనపు రైళ్ల ప్రారంభోత్సవం తర్వాత, విశాఖపట్నం-సికింద్రాబాద్ కూడా రెండు వందే భారత్ రైళ్లతో ఈ జాబితాలో చేరనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+