మణిపూర్ హింసపై మౌనమేల ? మోడీకి కాంగ్రెస్ సహా 10 విపక్ష పార్టీల లేఖ..
మణిపూర్ లో రెండు నెలల క్రితం ప్రారంభమైన ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఘర్షణలు అదుపులోకి రావడం లేదు. ఇందులో వంద మందికి పైగా పౌరులు ఇప్పటికే చనిపోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. అయినా ఘర్షణలు మాత్రం తగ్గలేదు. కేంద్రంతో పాటు మణిపూర్ ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించినా, ఘర్షణలపై విచారణకు ఆదేశించి దర్యాప్తు చేయిస్తున్నా ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిపై ప్రధాని మోడీ మాత్రం మౌనం వహిస్తున్నారు.
మణిపూర్‌లో 110 మందికి పైగా మరణాలకు, వందలాది మంది నిర్వాసితులు కావడానికి కారణమైన హింసను అడ్డుకునే విషయంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇవాళ 10 విపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. ఇందులో కాంగ్రెస్ తో పాటు జేడీయూ, కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలు ఉమ్మడిగా రాసిన ఈ లేఖలో పలు అంశాల్ని కేంద్రానికి గుర్తుచేశాయి.

ఈ లేఖలో ప్రతిపక్ష పార్టీలు కేంద్రం ,రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం విభజించి పాలించే రాజకీయాలు మణిపూర్‌లో హింసను అరికట్టడంలో విఫలమయ్యాయని నిందించాయి. మణిపూర్ ముఖ్యమంత్రిని ప్రస్తుత జాతి హింసకు రూపశిల్పి అని కూడా
ఆరోపించాయి. ఆయన సకాలంలో నియంత్రణ చర్యలు తీసుకునే ఉంటే హింసను ఆపగలిగే వారన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత కూడా హింస ఆగలేదని, ప్రధాని మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని కోరాయి.
మణిపూర్ లో కాల్పులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చిన ప్రతిపక్ష పార్టీలు అన్ని సాయుధ సమూహాలను తక్షణమే నిరాయుధులను చేయాలని ,తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరాయి. ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ ఐక్యత ప్రాదేశిక సమగ్రత కోసం నిలబడతాయని కుకీ తెగకు చెందిన ఇద్దరు మంత్రులతో సహా పది మంది ఎమ్మెల్యేలు కోరినట్లుగా కుకీలకు "ప్రత్యేక పరిపాలన" డిమాండ్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు.
-
భారత్ కు అమెరికా బిగ్ షాక్..! రష్యా-ఇరాన్ పై కోపం మన మీద..! -
జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications