చిత్రకూట్ లో భక్తుల తొక్కిసలాట, 10 మంది మృతి

10 pilgrims killed in Chitrakoot temple in Madhya Pradesh
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా చిత్రకూట్ లో కంఠనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం తొక్కసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మృతి చెందగా.. 60 మంది పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. అమావాస్య సందర్బంగా భక్తులు తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలిస్తున్నారు. విద్యుత్ తీగ తెగిపడిందనే వదంతు రావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొని తొక్కిసలాట దారితీసినట్లు సమాచారం.

తొక్కసలాట ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం

సోమవారం ఉదయం జరిగిన తొక్కసలాట ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. ఘటనలో గాయపడిన మృతుల కుటంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల నష్టపరిహారం ప్రకటించింది. రేవా రేంజ్ ఐజీ పవన్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఉదయం 5.30 ని.లకు సమాచారం అందడంతో సంఘటనాస్దలికి టీమ్స్ ని పంపి సహాయ చర్యలు చేపట్టామన్నారు.

మధ్యప్రదేశ్ లోని కమాద్గిరి కొండపై కంఠనాథ్ ఆలయం ఉంది. ప్రమాదం సంభవించిన సమయంలో 5 కి.మీ దారి పోడవు వరకూ భక్తులు వేచి ఉన్నారు. ఈ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో శ్రీ కామనాథ్ దేవాలయం ఒకటి. పోలీసుల కథనం ప్రకారం కమాద్గిరి కొండ వెనుక ప్రాంతంలో ఆలయం ప్రాంగణంలో ఈ ఘటన జరిగిందన్నారు. గతంలో అక్టోబర్ 13, 2013న మధ్యప్రదేశ్ లోని దటియా జిల్లా రత్నగర్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 115 మంది చనిపోగా, 100మందికి పైగా గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+