100 మిలియన్ల డోస్: జనవరి వరకు కోవిషిల్డ్, ఫిబ్రవరి వరకు మరిన్ని మిలియన్ల వ్యాక్సిన్..
గుడ్ న్యూస్... కోవిషిల్డ్ వ్యాక్సిన్ జనవరి నాటికి అందుబాటులోకి రానుంది. 100 మిలియన్ల డోసులు అందజేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదర్ పూనావల్లా పేర్కొన్నారు. కోవిషిల్డ్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావం చూపుతోందని.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తోందని తెలిపారు. ఫిబ్రవరి నాటికి మిలియన్ల డోసులు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
ఇప్పటికే 40 మిలియన్ డోసులను ఉత్పత్తి చేశామని పూనావల్లా తెలిపారు. ఒక్కో వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.250 కన్నా.. అంతకన్నా తక్కువకు కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. అయితే ప్రైవేట్ మార్కెట్‌లో మాత్రం ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయించే ఛాన్స్ ఉంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు కొంత నగదు వస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుందని.. సమర్థతపై సంతృప్తిగా ఉందని తెలిపింది.

బ్రిటన్, బ్రెజిల్‌లో చేసిన పరీక్షల ఆధారంగా ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకా 90 శాతం ప్రభావం చూపుతోంది
Recommended Video
. అయితే ఫైజర్, మోడెర్నా కంటే కోవిషిల్డ్ చౌకగా లభిస్తోంది. దీనిని ఫ్రీజులో పెట్టి ట్రాన్స్ పోర్ట్ కూడా చేయొచ్చు. నిల్వ చేసి.. పేద దేశాలకు కూడా పంపిణీ చేయొచ్చు.












Click it and Unblock the Notifications