వావ్.. గోవాలో 100 శాతం వ్యాక్సినేషన్ కంప్లీట్, సెకండ్ ప్లేస్.. మరో నెలన్నర రోజుల్లో..
కరోనాను ఎదుర్కొవాలంటే టీకా తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్ గురించి తొలినాళ్లలో భయం ఉండేది. కానీ వైరస్ జయించాలంటే తప్పదని తెలిసి.. అందరూ తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటికే 70 కోట్ల మంది టీకా తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే గోవా ఈ విషయంలో మరింత ముందు ఉంది. చిన్న రాష్ట్రం అయినా.. అవగాహనతో ముందుకు వెళుతుంది. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేశారు. ఈ విషయాన్ని సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. 18 ఏళ్ల నుంచి వృద్దుల వరకు వ్యాక్సిన్ ఇస్తోన్న సంగతి తెలిసిందే.

అక్టోబర్ 31వ తేదీ..
అంతేకాదు వచ్చేనెల 31వ తేదీ వరకు రెండో డోసు కూడా అందరికీ ఇస్తామని ఆయన చెబుతున్నారు. రాష్ట్రంలో వైరస్ నియంత్రణలోనే ఉందని చెప్పారు. అర్హుు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. గోవాతోపాటు హిమాచల్ ప్రదేశ్ కూడా ఇలాంటి ప్రకటన చేసింది. అర్హులైన వారందరికీ 100 శాతం వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు సీఎం జైరామ్ ఠాకూర్ తెలియజేశారు. నవంబర్ 30వ తేదీ వరకు రెండు డోసులు పూర్తి చేస్తామని తెలియజేశారు. అర్హులైన వారందరికీ ఫస్ట్ డోసు ఇచ్చిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. తర్వాత స్థానంలో గోవాకు చోటు లభించింది. ఇరు రాష్ట్రాల సీఎంలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

కరోనా ఇంపాక్ట్
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

జాగ్రత్తలు తప్పనిసరి
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

డేంజరస్ డెల్టా
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications