మరోమారు తెగబడిన నక్సలైట్లు: 11 మంది జవాన్లు బలి
నక్సలైట్లు చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మరోసారి పంజా విసిరారు. ఈ దాడిలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు హతమయ్యారు. పక్కా ప్లాన్‌తో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
సుఖ్మా: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలైట్లు మరోసారి తెగబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుఖ్మా జిల్లాలో శనివారంనాడు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
తమకు అందిన సమాచారం మేరకు మావోయిస్టుల దాడిలో 9 మంది జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు.

నక్సలైట్లు మరణించిన జవాన్లకు చెందిన పది ఆయుధాలను, రేడియో సెట్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications