వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారం కోసం వెళ్లి.. 11మంది అక్కడిక్కడే చనిపోయారు

|
Google Oneindia TeluguNews

జకార్తా : ప్రపంచ మార్కెట్ లో బంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో.. ఇండోనేషియాలో అక్రమ బంగారు గనుల తవ్వకం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదే క్రమంలో మూతపడ్డ ఓ బంగారు గనిలో బంగారం అన్వేషణ కోసం వెళ్లిన 11 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

11 feared dead as gold mine collapses in Indonesia

భారీ వర్షానికి మట్టిపెళ్లలు విరిగిపడడంతో.. వారంతా సజీవ సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. సుమత్రా దీవిలో సుమారు 50మీటర్ల లోతులో అక్రమ తవ్వకాలు జరుపుతుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 21నుంచి 55ఏళ్ల మధ్య వయసున్న మొత్తం 11మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం.

ప్రస్తుతం మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గతేడాది అక్టోబర్ లో జావా దీవిలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. అప్పట్లో నిరుపయోగంగా ఉన్న బంగారు గనిలోకి వెళ్లిన 12మంది అందులోనే చనిపోయారు.

English summary
At least 11 persons have reportedly died after a gold mine collapsed in Indonesia's western Jambi province on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X