హైవేపై ఢీకొన్న రెండు బస్సులు: 11 మంది మృతి, 20మందికి గాయాలు

ముంబై: ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పాల్‌ఘర్ జిల్లాలోని అచ్ఛాద్ గ్రామ సమీపంలో ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 11 killed, 20 injured in bus accident on Mumbai-Ahmedabad highway

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వాపిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

11మంది మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఓ ఐదేళ్ల పాప ఉన్నారని పోలీసులు చెప్పారు. మృతదేహాలను తాలసరి గ్రామీణ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మినీ బస్సులోని డ్రైవర్ నిద్రించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+