దారుణం: బాలికపై రేప్ చేసి రాళ్లతో కొట్టి చంపారు
జంషెడ్పూర్: జార్ఖండ్‌లోని జంషద్పూర్లో కొత్త సంవత్సరం రోజున జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పదకొండేళ్ల బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పాశవికంగా రాళ్లతో కొట్టి చంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసదెరా గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక కొత్తసంవత్సరం రోజున సమీపంలోని అడవిలోకి వెళ్లింది. తిరిగి వస్తుండగా.. బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం వారి నేరం బయటపడకూడదని ఆమెను రాళ్లతో కొట్టి హతమార్చారు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఊరంతా గాలించారు. చివరకు అడవిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
బాలిక మృతదేహాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితురాలి గ్రామానికి చెందిన వారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications