112 అత్యవసర నంబర్ త్వరలో దేశవ్యాప్తంగా అమలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రమాదం జరిగితే సమాచారం అందించే అత్యవసర నెంబర్‌ను కేంద్రప్రభుత్వం ఆవిష్కరించింది. ఇదివరకు 100, 101, 102 నెంబర్లు ఉండేవి. వాటి స్థానంలో 112 నెంబర్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అత్యవసర నెంబర్‌ను ఆవిష్కరించారు. 112 నెంబర్‌ను తొలుత ఢిల్లీని ప్రయోగాత్మకంగా ప్రారంభించామని కిషన్ రెడ్డి తెలిపారు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏ ఆపద వచ్చినా వెంటనే ఫోన్ చేయాలని కోరారు.

112కు ఫోన్ చేస్తే చాలు ఐదుగురికి అనుసంధానం అవుతుంది. అలా ఐదుగురికి సమాచారం వెళ్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి ప్రజలు 100, 101, 102కు ఫోన్ చేసినా అదీ 112కు కనెక్ట్ అవుతుందని వివరించారు. ఈ నంబర్ ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సేవలను పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఏ ఆపద వచ్చినా వెంటనే ఫోన్ చేయాలని కోరారు.

112 emergency number will be work nationwide : kishan reddy

ప్రజలు తమకు తక్షణ సాయం కోసం 112 నొక్కొచ్చని తెలిపారు. లేదంటే మూడుసార్లు పవర్ బటన్ ప్రెష్ చేయాలని కోరారు. అదీ వెంటనే కంట్రోల్ రూంకు చేరుతుందని వివరించారు. సాయం పొందగోరే వారు సోషల్ మీడియా, ఈ మెయిల్, ఎస్సెమ్మెస్ కూడా చేయొచ్చని అధికారులు వివరించారు. ఏ రూపంలో తమకు సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+