అలసత్వం వద్దు - పెరుగుతున్న కరోనా కేసులు..!!
దేశ వ్యాప్తంగా కరనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. కరోనా సబ్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు. కేసుల సంఖ్య పెరగటం మాత్రం ఆందోళనకు కారణమవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,193కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. కరోనా కారణంగా శుక్రవారం 42 మరణాలు గుర్తించారు.
తాజాగా కరోనా కేసుల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలో ఎక్కువగా నమోదు అవుతున్నట్లు కేంద్రం చెబుతోంది. కేరళలో ఒక్క రోజే పది మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటివరకూ దేశంలో 4,48,81,877 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం 5,31,300 మంది అసువులు బాసారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.66 శాతమని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకూ 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్టు తెలిపింది. గతం రోజు కంటే నాలుగు శాతం కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.

కరోనా కొత్త ఇన్ఫెక్షన్లు విస్తరిస్తన్న వేళ అలసత్వ వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోసారి రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది. కరోనా మహమ్మారి పూర్తిగా తొలిగిపోలేదని పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాసారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగా ఉంటున్నా..పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందనే విషయం గుర్తించాలని సూచించింది. వ్యాప్తి ఎక్కువగా ఉందని అప్రమత్తం చేసింది. నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications