కరోనా డేంజర్ బెల్స్ - భారీగా పాజిటివ్ కేసులు..!!

దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591 మందికి పాజిటివ్‌ వచ్చింది. బుధవారం నాటికంటే ఇది 20 శాతం అధికం. ముందు రోజు 10,542 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత ఎనిమిది నెలల్లో ఒకేరోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా 29 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,31,230కి చేరింది. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతం కాగా, 0.15 శాతం కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.67 శాతం మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.48 కోట్లకు పెరిగింది. ఇందులో 4,42,61,476 మంది బాధితులు కోలుకున్నారు. మరో 65,286 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొద్ది రోజులగా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.16 లక్షణాలతో ఇన్ఫెక్షన్ ను గురి అవుతున్నారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

covid1

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.16 ప్రభావం మరో వారం నుంచి పది రోజుల వరకు ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తాజాగా అయిదుగురు చొప్పున మరణించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇద్దరు, కర్ణాటకలో ముగ్గురు, పాండిచ్చేరీ, తమిళనాడు, ఉత్తరాఖండ్, పంజాబ్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఆరుగురు మరణించగా, రాజస్థాన్..కేరళలో ఇద్దరు చొప్పున మరణించినట్లు అధికారులు వెలలగడించారు. మహారాష్ట్ర, ఢిల్లీలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని రెండు రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

covid1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+