గోల్డెన్ టెంపుల్‌లో ఉద్రిక్తత: కత్తులతో దాడి, గాయాలు
అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ స్వర్ణదేవాయలంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వర్ణదేవాలయంలో ఆలయ సెక్యూరిటీ, శిరోమణి అకాళీదళ్ కార్యకర్తలకు మధ్య వివాదం రాజుకుంది. దీంతో మాటమాట పెరిగి ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది.
ఇరు గ్రూపులు గునపాలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 12 మందికి గాయాలయ్యాయి. వివాదాన్న సద్దుమణించేందుకు సిక్కు మతపెద్దలు ప్రయత్నించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన దినం సందర్భంగా ర్యాలీ తీసేందుకు ఓ గ్రూపు ప్రయత్నించగా.. దాన్ని మరో గ్రూపు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications