12 లక్షల కొత్త కరెన్సీ నోట్ల విడుదల, త్వరలో నివేదికిస్తానన్న జైట్లీ
పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం చేసుకొన్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సుమారు 12 లక్షల కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
న్యూఢిల్లీ:పెద్ద నగదు నోట్ల రద్దు చేసిన తర్వాత 12 లక్షల కొత్త నగదు నోట్లను మార్కెట్లోకి విడుదల చేసిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్టీ ప్రకటించారు.గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం ఆధారంగా పాత నగదు నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకొన్నారు.

అయితే గత ఏడాది పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన సమయం నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ, తేతి వరకు సుమారు 12 లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లు మార్కెట్లోకి విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.
ఈ మేరకు ఆయన లోక్ సభకు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే మరికొంత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే ఎన్ని పాత నోట్లు వచ్చాయనే విషయాన్ని మాత్రం మంత్రి వెల్లడించలేదు.
ప్రతి కరెన్సీ నోటు అసలుదో నకిలీదో గుర్తించాల్సి ఉందన్నారు. అనంతరం ఎన్ని నకిలీ నోట్లను వేరు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.
ఈ ప్రక్రియ ముగిసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు.ఇదంతా ముగిసిన తర్వాత సమగ్రమైన నివేదికను సభకు అందించనున్నట్టు మంత్రి వెల్లడించారు.
నికర ప్రత్యక్ష పన్ను వసూళళ వివరాలను సభలో ప్రకటించారు మంత్రి. గత ఏడాది డిసెంబర్ లో రూ.1,40,824 కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయయన్నారు. అయితే 2015 డిసెంబర్ లో ఈ పన్నులు రూ.1,35,660 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారాయన.












Click it and Unblock the Notifications