బలవంతంగా వ్యభిచార కూపంలోకి: నలుగురు అరెస్ట్
ముంబై: మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కళ్యాణ్ రైల్వేస్టేషన్ సమీపంలో వ్యభిచారం జరుగుతుందోని స్థానికులు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన థానే క్రైం బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు.
ఈ ఘటనలో నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 10,700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా థానే క్రైం బ్రాంచ్ అధికారి షకీల్ షేక్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులపై దాడిచేసి మహిళలను రక్షించామన్నారు.

20 నుంచి 25 ఏళ్ల యువతులతో బలవంతంగా ఈ వృత్తి చేయిస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశామన్నారు. క్రైం బ్రాంచ్ ఆధ్వర్యంలో 12 మంది మహిళలను కాపాడి, రిమాండ్ హోంకు తరలించామన్నారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందని చెప్పారు.
ఆరోపణలను ఎదుర్కొంటున్న మహిళలను లక్ష్మీ (అమ్మ), పరమేశ్వర్ పాటిల్ (39), రాధా విజయ్ కొనపాక్కులా (46), రజియా అబ్ధుల్ కరీం షేఖ్ (48), లలితా బాల్య నాయక్ (35)గా గుర్తించారు.












Click it and Unblock the Notifications