ఓటు చోరీకి ఆధారాలేవీ?-ఈసీకి మద్దతుగా 124 మంది మాజీ బ్యూరోక్రాట్లు..!

ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం ( SIR)లో దాదాపు 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్న వేళ ఈసీకి అనూహ్య మద్దతు లభించింది. ఈసీపై ఓటు చోరీ ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో నిరసనలకు దిగుతున్న విపక్షాలపై మండిపడుతూ 124 మంది మాజీ బ్యూరోక్రాట్లు (Former bureaucrats) ఇవాళ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఐఎఫ్ఎస్ లు ఉన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వారు ఆందోళనకారుల్ని హెచ్చరించారు.

సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!

తాము ఏ పార్టీకి చెందినవాళ్లం కాదంటూ వీరు ఈ లేఖను విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితాల తయారీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత వంటి అంశాల్లో తమకు సుదీర్ఘ అనుభవం ఉందని వారు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండానే మన ఎన్నికలను రిగ్గింగ్ అయ్యాయంటూ అభివర్ణిస్తున్నారని, ఇలాంటి ప్రతి వ్యాఖ్య ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వారు లేఖలో పేర్కొన్నారు. గతంలో ఎన్నికల్లో బూత్‌లను ఆక్రమించడం, బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, వాటిలో అక్రమంగా ఓట్లు వేయడం, ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగేవని వారు గుర్తుచేశారు. బూత్ ఆక్రమణను 1989లో పార్లమెంట్ నేరంగా ప్రకటించిందని ప్రస్తావించారు.

124 Former bureaucrats Back ECI Amid Vote Chori Row Demand Evidence for Fraud Claims

2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తూ.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక్క రీపోల్ కూడా అవసరం లేకుండా ఎన్నికలు జరిగాయని, 1951 తర్వాత అత్యధిక ఓటింగ్ నమోదైందని గుర్తుచేశారు. మహిళల ఓటింగ్ కూడా రికార్డు స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల తరఫున పోలింగ్ ఏజెంట్లు ప్రతి పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రక్రియను పర్యవేక్షిస్తారని, పోలైన ఓట్ల వివరాలతో కూడిన సంతకం చేసిన పత్రాన్ని పొందుతారని వివరించారు. ఈవీఎంలను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి, వారి సంతకాలతో భద్రపరుస్తారని తెలిపారు.

Telangana SIR: 74 లక్షల మందికి గుడ్ న్యూస్- ఈసీ కీలక అప్డేట్..!
Telangana SIR: 74 లక్షల మందికి గుడ్ న్యూస్- ఈసీ కీలక అప్డేట్..!

కౌంటింగ్‌కు ముందు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచుతారని, అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు వాటి భద్రతను పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వీవీప్యాట్ పేపర్ స్లిప్పులు, ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపును సరిపోల్చే విధానం కూడా ఎన్నికల ప్రక్రియలో ఒక భద్రతా చర్యగా ఉందని గుర్తుచేశారు. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు 2024లో సమర్థించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను పెద్ద ఎత్తున తారుమారు చేయాలంటే వివిధ ప్రభుత్వాలకు చెందిన అధికారులు, ఎన్నికల సిబ్బంది, ఓడిపోయిన అభ్యర్థుల ఏజెంట్లు సహా ఎంతోమంది సహకరించాల్సి ఉంటుందని మాజీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి భారీ కుట్ర జరిగినట్లు నిరూపితమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థను విమర్శించే వారు తమ ఆరోపణలకు తగిన ఆధారాలను చూపాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+