‘Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (SIR) ద్వారా భారీ ఎత్తున ఓట్లు తొలగించడం, ఇష్టారాజ్యంగా కొత్త ఓట్లను చేర్చడం వంటి అక్రమాల తర్వాత సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్లు మొదలయ్యాయి. వీటిని ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ లెక్కచేయకపోవడంతో అవి కాస్తా మరింత ఎక్కువయ్యాయి. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాలన్నీ నిరసనలతో అట్టుడుకుతున్నాయి.

CJP Protest: బెంగళూరులో కాక్రోచ్ గర్జన-ధృవ్ రాఠీ, ప్రకాష్ రాజ్ హాజరు..!
CJP Protest: బెంగళూరులో కాక్రోచ్ గర్జన-ధృవ్ రాఠీ, ప్రకాష్ రాజ్ హాజరు..!

కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్ష ఇండియా కూటమి పార్టీలు, అఖిల భారత స్ధాయిలో పనిచేస్తున్న విద్యార్ధి సంఘాలు .. ఇలా ప్రతీ ఒక్కరూ ఏకమవుతున్నారు. వీరంతా కలిసి అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో వీరందరినీ ఏకం చేస్తున్న ఏకైక నినాదం (Slogan) Gyanu, It's Done Bro (జ్ఞానేష్..ఇక నీ పని అయిపోయింది). ఈ నినాదం లేకుండా ఒక్కటంటే ఒక్క నిరసన ప్రదర్శన కూడా జరగడం లేదు. అలాగే సోషల్ మీడియాలోనూ గ్యానూ.. ఇట్స్ డన్ బ్రో అంటూ వేల సంఖ్యలో ట్వీట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ నినాదం కాస్తా భారీగా వైరల్ అవుతోంది.

Gyanu It s Done Bro Slogan Unites CJP INDIA Bloc Opposition and Student Unions
ఈసీల నియామక చట్టం తీర్పు రీకాల్ ? ఛీఫ్ జస్టిస్ ముందుకు కీలక పిటిషన్ ..!
ఈసీల నియామక చట్టం తీర్పు రీకాల్ ? ఛీఫ్ జస్టిస్ ముందుకు కీలక పిటిషన్ ..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఇప్పటికే ఎస్ఐఆర్ ఆధారంగా నిర్వహించిన ఎన్నికల్ని రద్దు చేయాలని విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ధి సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. వీటిలో గ్యానూ.. ఇక నీ పని అయిపోయిందనే నినాదం వినిపించడం ద్వారా సీఈసీ రాజీనామాకు ఒత్తిడి తీవ్రతరం చేస్తున్నారు. అంతే కాదు దీన్ని ఉద్యమ కారులంతా కలిసి ఉద్యమ నినాదంగా కూడా మార్చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా ఇదే నినాదం కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఢిల్లీలో గతంలో జంతర్ మంతర్ లో నిర్వహించిన ఆందోళనలకు మించి ఈసారి భారీ నిరసనలకు కాక్రోచ్ లతో పాటు విపక్షాలు కూడా సన్నద్ధం కావడం, అందుకు తగ్గట్టుగానే సీఈసీ రాజీనామా, ఎస్ఐఆర్ ద్వారా నిర్వహించిన ఎన్నికల రద్దు వంటి డిమాండ్లు చేస్తున్నారు. వీటికి ఊపు తెచ్చే క్రమంలో గ్యానూ.. నీ పని అయిపోయిందనే నినాదం తెరపైకి తీసుకురావడంలో ముందుగా కాక్రోచ్ లు సక్సెస్ అయితే ఇప్పుడు విపక్ష పార్టీలన్నీ దాన్ని అందుకున్నాయి. దీంతో ప్రతీ చోటా ఈ నినాదం మార్మోగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+