CJP Protest: బెంగళూరులో కాక్రోచ్ గర్జన-ధృవ్ రాఠీ, ప్రకాష్ రాజ్ హాజరు..!
ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు.. ఇవాళ బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ లో మహాధర్నా (CJP Protest ) చేపట్టారు. అక్టోబర్ 10న ఢిల్లీ వేదికగా జరిగే భారీ ధర్నాకు సన్నాహకంగా బెంగళూరులో వారు సమావేశమయ్యారు. ఈ ధర్నాకు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ , ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ నేత అభిజీత్ దీప్కే సహా పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం సర్ ను రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ లో ప్రజా ట్రైబ్యునల్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే పలువురు కార్యకర్తలు, పౌర సమాజ సంస్థలు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌కు తరలిరావడంతో జనసమూహం పెరగడం ప్రారంభమైంది. మధ్యాహ్నం సుమారు 1 గంటకు, సీజేపీ నాయకులు దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా సభా ప్రాంగణానికి చేరుకుని, రాఠీ, ప్రకాష్ రాజ్‌లతో కలిసి వేదికపై చేతులు పైకెత్తారు. జనం మోడీ వ్యతిరేక నినాదాలు, ఓటు దొంగ, ఓటు దొంగ నినాదాలు చేశారు.

ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దేశం మొత్తాన్ని అవమానించిందని నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో ప్రజలే నిర్ణయించేవారని, కానీ ఎస్ఐఆర్ తో ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తోందన్నారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 13 కోట్లకు పైగా ప్రజలు ఎన్నికలలో పాల్గొనకుండా మినహాయింపునకు గురైన SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అందుకే పౌరుల హక్కులను పునరుద్ధరించడానికే ఈ ఆందోళన చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ నిరసన యొక్క లక్ష్యం కేవలం సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం మాత్రమే కాదని, ఆయన వెళ్తే, ఆయన స్థానంలో మరొకరు వస్తారన్నారు. ఎస్ఐఆర్ ను రద్దు చేయించడమే తమ లక్ష్యమన్నారు.
మరోవైపు ఫ్రీడమ్ పార్క్‌లో జరుగుతున్న సీజేపీ నిరసన కార్యక్రమంలో ఎస్ఐఆర్ సమయంలో ముసాయిదా జాబితాల నుండి పేర్లు తొలగించిన పలువురు పాల్గొన్నారు. వారు ఒకే చోట నివసిస్తున్నప్పటికీ, వారిని స్థానమార్పిడి చెందినవారు, గైర్హాజరుగా గుర్తించారని సీజేపీ ఆరోపించిందివాస్తవానికి, ఓటర్ల జాబితాల నుండి తొలగించబడిన ప్రజల అనుభవాలను వినడానికే ఈ 'ప్రజా న్యాయస్థానం' నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బతికి ఉన్నవారిని చనిపోయినవారిగా ప్రకటిస్తున్నారని, ఇదే ప్రజాస్వామ్య మరణం అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. తమను బొద్దింకలలా బతకాలని వారు కోరుకుంటున్నారు కాబట్టే బొద్దింకలని పిలుస్తున్నారని,, కానీ మనం బొద్దింకలాగే దృఢంగా ఉండాలన్నారు.















Click it and Unblock the Notifications
